-
-
Home » Andhra Pradesh » West Godavari » Power supply disrupted today
-
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
ABN , First Publish Date - 2020-05-18T11:07:37+05:30 IST
మండలంలో వీరిశెట్టిగూడెం 33/11కేవీ సబ్‌స్టేషన్ పరిధిలో సోమవారం నూతన ట్రాన్స్‌ఫార్మర్‌లను ఏర్పాటు

కామవరపుకోట, మే 17: మండలంలో వీరిశెట్టిగూడెం 33/11కేవీ సబ్‌స్టేషన్ పరిధిలో సోమవారం నూతన ట్రాన్స్‌ఫార్మర్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు జంగా రెడ్డిగూడెం ఎలక్ట్రికల్ ఈఈ బి.సురేశ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంవీఏ రెండు పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌లను ఏర్పాటు చేసేందుకు యడవల్లి సబ్ స్టేషన్‌లో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తారన్నారు. కాసరనేనివారిగూడెం, వీకేపురం, వీరిశెట్టిగూడెం గ్రామాల్లో విద్యుత్ సరఫరా ఉండదని, వినియోగదారులు సహకరించాలని కోరారు.