పౌలీ్ట్ర వ్యాపారి ఆస్తుల జప్తు
ABN , First Publish Date - 2020-10-29T05:24:15+05:30 IST
బ్యాంకులను మోసం చేశాడన్న అభియోగాన్ని ఎదుర్కొంటున్న తణుకుకు చెందిన పౌలీ్ట్ర వ్యాపారి పోలేపల్లి వెంకటప్రసాద్‌కు చెందిన రూ.7.57 కోట్ల విలువైన ఆస్తిని జప్తు చేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఓ ప్రకటన విడుదల చేసింది.

నిధుల మళ్లింపు కేసులో రూ.7.57 కోట్ల ఆస్తుల జప్తు
రెండు బ్యాంకుల వద్ద రూ.17.24 కోట్ల రుణం
తిరిగి చెల్లించకపోవడంతో సీబీఐ, ఏసీబీ కేసులు
జప్తు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్
ఏలూరు, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): బ్యాంకులను మోసం చేశాడన్న అభియోగాన్ని ఎదుర్కొంటున్న తణుకుకు చెందిన పౌలీ్ట్ర వ్యాపారి పోలేపల్లి వెంకటప్రసాద్‌కు చెందిన రూ.7.57 కోట్ల విలువైన ఆస్తిని జప్తు చేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఓ ప్రకటన విడుదల చేసింది. పీబీఆర్ పౌలీ్ట్ర టెక్ పేరిట ప్రసాద్ ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకుల నుంచి రూ.17.24 కోట్లు రుణం తీసుకుని మోసం చేసినట్లు సీబీఐ, విశాఖపట్నం అవినీతి నిరోధక శాఖ గతంలో కేసు నమోదు చేసింది. నిధుల మళ్లింపు(మనీ లాండరింగ్) చట్టం ప్రకారం దీనిపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకు నుంచి రూ.5.60 కోట్లు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల రుణ సదుపాయం పథకం కింద మరో రూ.1.74 కోట్లు రుణంగా తీసుకుని దారి మళ్లించినట్లు గుర్తించింది. మరో సంస్థ పేరుతో తణుకు, విశాఖకు చెందిన ఆంధ్రాబ్యాంకు బ్రాంచీల నుంచి తాత్కాలిక రుణం కింద రూ.6.73 కోట్లు, పీబీఆర్ అగ్రిటెక్ అనే మరో కంపెనీ పేరుతో రూ.3.2 కోట్లు రుణంగా తీసుకుని చెల్లించకుండా వదిలేసినట్లు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం తణుకులో నిందితుడి పేరు మీద వున్న రూ.5.07 కోట్ల విలువ చేసే 21 స్థిరాస్తులు, రూ.50 లక్షల నగదును జప్తు చేసింది. దీనిపై వెంకటప్రసాద్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ‘రాజకీయంగా తనపై కొందరు తప్పుడు ఫిర్యాదులు చేసి ఇబ్బందులు పెడు తున్నారు. నేను బ్యాంకులను మోసగించి రుణాలు తీసు కోలేదు. లోను కట్టేందుకు అడుగుతున్నా..బ్యాంకర్లు సహకరించడం లేదు. నా ఆస్తులను ఎవరూ జప్తు చేయలేదు’ అని చెప్పారు.