హైస్కూలు విద్యార్థులకు రచనల పోటీ

ABN , First Publish Date - 2020-11-28T04:51:23+05:30 IST

సర్వోదయ మండలి ఆధ్వర్యంలో హైస్కూలు విద్యార్థులకు రచనల పోటీ నిర్వహిస్తున్నట్టు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు తెలిపారు.

హైస్కూలు విద్యార్థులకు రచనల పోటీ

ఏలూరు ఎడ్యుకేషన్‌, నవంబరు 27 : సర్వోదయ మండలి ఆధ్వర్యంలో హైస్కూలు విద్యార్థులకు రచనల పోటీ నిర్వహిస్తున్నట్టు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు తెలిపారు.ఈ మేరకు శుక్రవారం  ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగులో ఒక పేజీకి మించకుండా గద్యరూపంలో కాని, పద్య రూపంలో కాని,బొమ్మల రూపంలో కాని రచనలు ఉండాలన్నారు. 8,9,10 తరగతుల విద్యార్థు లకు విద్య– ఆరోగ్యం అనే అంశంపైన, 6, 7 తరగతులకు పొదుపు – నిరాడంబరత అనే అంశంపైన పోటీ ఉంటుందన్నారు. విద్యార్ధులు స్వదస్తూరితో రాసి డిసెంబరు 10వ తేదీలోగా ‘కార్యదర్శి, సర్వోదయ మండలి, గాంధీ – కస్తూరిభా భవనం, శ్రీరామపురం, భీమవరం – 2’ చిరునామాకు పోస్టు ద్వారా పంపాలని సూచించారు. ఉత్తమ రచనలకు డిసెంబరు 16న బహుమతులు అందజేస్తామన్నారు. వివరాలకు ఫోన్‌ 99490 93115లో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. 

Read more