‘పంచారామాల’ పోస్టల్ కార్డుల ఆవిష్కరణ
ABN , First Publish Date - 2020-12-10T06:08:22+05:30 IST
దేశ రాజకీయ, ఆధ్యాత్మిక అంశాలపై ఆ యా రంగాల విశిష్టత భావితరాలకు తెలిపే విధంగా పోస్టల్ శాఖ స్టాంపులను, పోస్టుకార్డుల ను విడుదల చేస్తోందని తాడేపల్లిగూడెం పోస్టల్ సూపరింటెండెంట్ పి. వెంకటస్వామి తెలిపారు.

పాలకొల్లు అర్బన్/ భీమవరం టౌన్ , డిసెం బరు 9 : దేశ రాజకీయ, ఆధ్యాత్మిక అంశాలపై ఆ యా రంగాల విశిష్టత భావితరాలకు తెలిపే విధంగా పోస్టల్ శాఖ స్టాంపులను, పోస్టుకార్డుల ను విడుదల చేస్తోందని తాడేపల్లిగూడెం పోస్టల్ సూపరింటెండెంట్ పి. వెంకటస్వామి తెలిపారు. పాలకొల్లులో పంచారామ క్షేత్రాల పై పోస్టల్‌శాఖ ఆధ్వర్యంలో హెడ్ పోస్టుమాస్టర్ వి.మోహన్‌కుమార్ అధ్యక్షతన క్షీరా రామలింగేశ్వరస్వామి పోస్టు కార్డును బుధవారం ఆవిష్కరించారు. అదేవిధంగా భీమవరంలోని గునుపూడి పంచారామ క్షేత్రమైన సోమేశ్వరజనార్దన స్వామి దేవస్థానంలో పోస్టు కార్డును తపాలా శాఖ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ ఒ.విజయ్‌కుమార్ ఆవిష్కరించారు. పాలకొల్లు క్షీరారామం ఆలయంలో వెంకట స్వా మి మాట్లాడుతూ పంచారామాల్లోని విశిష్టతపై ముద్రించిన కార్డులను విజయవా డలో దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆన్‌లైన్ ద్వారా ఆవిష్కరిం చారని తెలిపారు. పోస్టుకార్డు ధర రూ.20గా నిర్ణయించామని పోస్టాఫీసుల్లో విక్ర యాలు చేస్తారన్నారు. కార్యక్రమాల్లో ఈవోలు సూర్యనారాయణ, తోట శ్రీనివాస రావు, పోస్టల్, ఆలయ సిబ్బది పాల్గొన్నారు.