గోదారమ్మకు మహా నీరాజనం
ABN , First Publish Date - 2020-12-30T05:52:32+05:30 IST
అఖండ గోదావరి మాతకు పౌర్ణమిని పురస్కరించుకుని 182వ మాసోత్సవ మహానీరాజనం అందజేశారు.
కొవ్వూరు డిసెంబరు 29: అఖండ గోదావరి మాతకు పౌర్ణమిని పురస్కరించుకుని 182వ మాసోత్సవ మహానీరాజనం అందజేశారు. గోదావరి నీరాజన సమితి అధ్యక్షుడు కలిగొట్ల కృష్ణారావు ఆధ్వర్యంలో మంగళవారం గోష్పాద క్షేత్రంలోని ప్రధాన స్నానఘట్టంలో గోదావరిమాత విగ్రహం వద్ద కుంకుమార్చన చేశారు. అనంతరం అఖండ గోదావరికి హారతులు ఇచ్చారు. మహిళలు దీపాలు వెలిగించి నదిలో వదిలి దీపోత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.