నేటి నుంచి పాలిటెక్నిక్ కౌన్సెలింగ్
ABN , First Publish Date - 2020-10-14T17:58:32+05:30 IST
పాలిటెక్నిక్ విద్యార్థులకు బుధవారం నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది భీమవరంలోని..

జిల్లాలో రెండు హెల్ప్‌లైన్ సెంటర్లు
భీమవరం సీతా పాలిటెక్నిక్, తణుకు ఎస్‌ఎంవీఎం
మొదటి రోజు 9 వేల ర్యాంకు వరకు
భీమవరం: పాలిటెక్నిక్ విద్యార్థులకు బుధవారం నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది భీమవరంలోని బీవీ రాజు సీతా పాలిటెక్నిక్ కళాశాల, తణుకు ఎస్‌ఎంవీఎం పాలిటెక్నిక్ కళాశాలల్లో రెండు హెల్ప్‌లైన్ సెంటర్లలో కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు చేశారు. మొదటి రోజు ఒకటి నుంచి తొమ్మిది వేల ర్యాంకు వరకు వచ్చిన విద్యార్థులు సర్టిఫికెట్‌ల వెరిఫికేషన్‌కు హాజరు కావాలి. 15న 9,001 నుంచి 24,000 వరకు, 16న 24,001-42,000 వరకు, 17న 42,001 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఇది జరుగుతుంది. ఎస్టీ విద్యార్థులు మాత్రం తణుకు ఎస్‌ఎంవీఎం కళాశాల హెల్ప్‌లైన్ సెంటర్‌కు హాజరుకావాలి. ఈ నెల 12, 13 తేదీలలో ఆన్‌లైన్‌లో చేసుకున్న విద్యార్థులు సర్టిఫికెట్‌లు అప్‌లోడ్ అవ్వకపోయినా ఏ ఇతర ఇబ్బందులు వచ్చినా హెల్ప్‌లైన్ సెంటర్‌కు వచ్చి సరిచేయించుకోవచ్చునని సీతా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ డీవీ సుబ్బారావు తెలిపారు.
విద్యార్థులు తీసుకురావాల్సినవి :
ఆదాయ ధ్రువీకరణ పత్రం లేదా తెల్ల రేషన్ కార్డు
పాలిసెట్ హాల్ టికెట్, ర్యాంకు కార్డు
10వ తరగతి మార్కుల జాబితా, టీసీ
నాలుగు, పది తరగతుల స్టడీ సర్టిఫికెట్‌లు
బీసీ, ఎస్సీ, ఎస్టీ వారు కుల ధ్రువీకరణ పత్రాలు
ఈడబ్ల్యుఎస్ సర్టిఫికెట్.. లేకపోయినా పర్వాలేదు
కౌన్సెలింగ్ ఫీజు బీసీ, ఓసీ రూ.700, ఎస్సీ, ఎస్టీ రూ.400
స్పెషల్ కేటగిరీ వారికి విజయవాడలో కౌన్సెలింగ్
స్పెషల్ కేటగిరీ కోటా విద్యార్థులు విజయవాడ బెంజి సర్కిల్ వద్ద గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి. ఈనెల 14న ఆంగ్లో ఇండియన్, దివ్యాంగ విద్యార్థులు, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల పిల్లలు హాజరు కావాలి. 15న స్పోర్ట్స్ కోటా విద్యార్థులు, 16న ఎన్‌సీసీ విద్యార్థులు హాజరు కావాలి.
జిల్లాలో 7 వేల సీట్లు
జిల్లాలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు 3, ఎయిడెడ్ కళాశాల 1, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలు 7, ఇంజనీరింగ్ సెకండ్ షిఫ్ట్ పాలిటెక్నిక్ కళాశాలలు 10 ఉన్నాయి. వీటిలో సుమారు 7 వేల సీట్లు వరకు అందుబాటులో ఉన్నాయి. ఈసీఈ, ఈఈఈ, సీఎస్‌ఈ, మెకానికల్, సివిల్, ఆటో మొబైల్, అప్లయిడ్ ఎలకా్ట్రనిక్స్ ఇనుస్ట్రమెం టేషన్, పెట్రోలియం టెక్నాలజీ, కెమికల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కౌన్సెలింగ్ పూర్తయిన తరువాత ఈ నెల 20న కళాశాలల అలాట్‌మెంట్ వస్తుంది. ఈ నెల 27వ తేదీలోపు కళాశాల నచ్చినట్లయితే విద్యార్థులు ఆ కళాశాలలో రిపోర్టు చేసుకోవాలి. కోవిడ్ కారణంగా తరగతుల ప్రారంభం ఎప్పుడన్నదీ స్పష్టత లేదు.