సీఎం మహిళా పక్షపాతి : వాసిరెడ్డి పద్మ

ABN , First Publish Date - 2020-11-01T05:02:43+05:30 IST

సీఎం జగన్మోహన్‌ రెడ్డి మహిళా పక్షపాతి అని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు.

సీఎం మహిళా పక్షపాతి : వాసిరెడ్డి పద్మ

చింతలపూడి (లింగపా లెం), అక్టోబరు 31: సీఎం జగన్మోహన్‌ రెడ్డి మహిళా పక్షపాతి అని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. లింగపాలెం మండలంలోని గ్రామంలో ఇటీవల హత్యకు గురైన బాలి క కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు ఏ సమస్య ఉన్నా స్థానిక సచివాలయ వ్యవస్థ ద్వారా పరిష్కరించుకోవచ్చు అన్నారు.  అనంతరం రూ. 25 వేల చెక్కును బాలిక కుటుంబానికి ఆమె అందించారు. ఎమ్మెల్యే ఎలీజాతో పాటు నాయకులు పాల్గొన్నారు. 

Read more