పేకాట శిబిరాలపై దాడులు: పలువురి అరెస్టు

ABN , First Publish Date - 2020-12-28T05:57:02+05:30 IST

పట్టణ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో పేకాడుతున్న వారిపై ఆదివారం దాడి చేసి 10 మందిని అరెస్టు చేసి, వారి ్దనుంచి రూ.6940లు నగదును స్వాధీనం చేసుకున్నట్టు పట్టణ ఎస్‌ఐ ప్రసాద్‌ తెలిపారు.

పేకాట శిబిరాలపై దాడులు: పలువురి అరెస్టు


పాలకొల్లు అర్బన్‌, డిసెంబరు 27: పట్టణ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో పేకాడుతున్న వారిపై ఆదివారం  దాడి చేసి 10 మందిని అరెస్టు చేసి, వారి  ్దనుంచి రూ.6940లు నగదును స్వాధీనం చేసుకున్నట్టు పట్టణ ఎస్‌ఐ ప్రసాద్‌ తెలిపారు. సంధ్యా మెరైన్స్‌ సమీపంలోని ఖాళీ స్థలంలో పేకాడుతున్న ఆరుగురిని అరెస్టు చేసి వారి  నుంచి రూ 4120లు నగదు, సబ్బేవారిపేటలో పేకాడుతున్న మరో నలుగురిని అరెస్టు చేసి రూ. 2820లు  స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. 

భీమవరం క్రైం: భీమవరం మండలం కరుకువాడ బేతపూడి గ్రామంలో పేకాట శిబిరంపై ఆదివారం పోలీసులు దాడి చేశారు. దాడిలో ఏడుగురు జూదరులను అరెస్టు చేసి రూ.6,150 నగదు స్వాధీనం చేసుకున్నట్లు రూరల్‌ ఎస్‌ఐ కె సుధాకర్‌రెడ్డి తెలిపారు. 

కాళ్ళ:  పేకాట స్థావరంపై దాడి చేసి నలుగురు జూదరులను అరెస్టు చేసినట్టు కాళ్ళ ఎస్‌ఐ మంతెన రవివర్మ తెలిపారు. పెద అమిరంలో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు సిబ్బందితో  దాడి చేసి నలుగురు జూదరులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.11,040 నగదును స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.


Updated Date - 2020-12-28T05:57:02+05:30 IST