ఉగాదికి అర్హులందరికీ స్థలాలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-03-04T11:16:27+05:30 IST

సమయం తక్కువగా ఉంది.ఉగాది నాటికి ఇంటి స్థలాలు అర్హు లందరికీ ఇవ్వాలి. దీన్ని లక్ష్యంగా తీసుకుని యం

ఉగాదికి అర్హులందరికీ స్థలాలు ఇవ్వాలి

నెలాఖరు నాటికి స్థానిక ఎన్నికలు

తాయిలాలిస్తే ఊరుకోవద్దు

పీఆర్‌ చట్టంలో ఆర్డినెన్స్‌

స్థలాలు సిద్ధం చేయాలని ఆదేశం

వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం


 (ఏలూరు-ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : సమయం తక్కువగా ఉంది.ఉగాది నాటికి ఇంటి స్థలాలు  అర్హు లందరికీ ఇవ్వాలి. దీన్ని లక్ష్యంగా తీసుకుని యం త్రాంగం పనిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మో హన్‌రెడ్డి జిలా కలెక్టర్లను ఆదేశించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం సమస్యలు ఉంటే తక్షణం పరిష్క రించాలని సూచించారు.వివిధ జిల్లాల కలెక్టర్లతో మంగళవారం ఆయన వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్సులో సమీక్షించారు.పేదలకు పంపిణీ చేసేలా ఇళ్ళస్థలాలను సంసిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అనుమతులు,ఆర్థిక వనరుల కేటాయింపుల విష యంలో కలెక్టర్లు చొరవ తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఈ నెలలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడానికి యంత్రాంగం సిద్ధంగా  ఉండాలన్నారు.


ఎంపీటీసీ,జడ్పీటీసీ,పంచాయతీ, ముని సిపల్‌ ఎన్నికలను ఈ నెలాఖరు నాటికి నిర్వహిస్తా మన్నారు.నగదు,మద్యం పంపిణీని నిరోధించాలని దృక్పథంతోనే  పంచాయతీ రాజ్‌ చట్టంలో సవరణల ఆర్డినెన్సు తెచ్చామని సీఎం జగన్‌ చెప్పారు. పోలీసు యంత్రాంగం కూడా దీనికి సవాల్‌గా తీసుకోవాల న్నారు.పోలీసు మిత్ర, మహిళా పోలీసులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. ఉగాది నాటికి జిల్లాలో అర్హులందరికీ ఇళ్ళపట్టాలు అందజేయడానికి ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు సీఎం దృష్టికి తీసుకు వెళ్ళారు.


ఇప్ప టికే గుర్తించిన భూముల్లో 2 వేల 300 లేఅవుట్లు వేస్తున్నామని..వాటిలో 1150కు పైగా పూర్తికావచ్చా యని తెలిపారు. భూసేకరణ ద్వారా 1116 ఎకరాలు సేకరించాల్సి ఉండగా ఇప్పటికే 922 ఎకరాలు సేకరి ంచి,సంబంధిత రైతులకు సొమ్ము చెల్లించామ న్నారు.ప్రతీ లేఅవుట్‌కు ఒక ప్రత్యేక అధికారిని నియ మించినట్టు చెప్పారు.ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజును సీఎం అభినందించారు. 

Updated Date - 2020-03-04T11:16:27+05:30 IST