సన్‌..డే!

ABN , First Publish Date - 2020-06-22T11:19:29+05:30 IST

రాహుగ్రస్త సూర్యగ్రహణం ఆదివారం జిల్లాలో పాక్షికంగానే కనిపించింది.సాధారణంగా ఈ చూడామణి నామక సూర్య గ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణమే అయినా ఉదయం

సన్‌..డే!

3.29 గంటలపాటు సూర్యగ్రహణం

మబ్బులతో వీక్షించలేకపోయిన ప్రజలు


ఏలూరుసిటీ/ కొవ్వూరు/జంగారెడ్డిగూడెం/ కామవరపుకోట/ దేవరపల్లి/ పెదవేగి/భీమడోలు/ భీమవరం టౌన్‌/ వీరవాసరం/ ఆచంట/ పాలకొల్లు అర్బన్‌, జూన్‌ 21 : రాహుగ్రస్త సూర్యగ్రహణం ఆదివారం జిల్లాలో పాక్షికంగానే కనిపించింది.సాధారణంగా ఈ చూడామణి నామక సూర్య గ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణమే అయినా ఉదయం వాతావరణంలో వచ్చిన మార్పులు కారణంగా మబ్బులు కమ్మివేయడంతో చాలా ప్రాంతాల్లో అసలు గ్రహణం కనిపించలేదు. ఉదయం గ్రహణం పట్టు సమయంలోనే కొన్ని ప్రాంతాల్లో కనిపించింది.. విడుపు సమయంలో అసలు కనిపించలేదని చెబుతున్నారు. ఉదయం 10.25 నుంచి మధ్యాహ్నం 1.54 గంటల వరకు దాదాపు 3.29 గంటల పాటు గ్రహణం కొనసాగిందని చెబుతున్నారు. గ్రహణం కారణంగా జిల్లాలో ప్రసిద్ధి చెందిన ద్వారకాతిరుమల చిన వెంకన్న, మద్ది ఆంజనేయ స్వామి, భీమవరం సోమేశ్వరస్వామి, మావుళ్లమ్మ, వీరవాసరం మండలం నందమూరుగరువు ఆంజనేయస్వామి తదితర దేవాలయాలను మూసివేశారు.


పంచారామక్షేత్రమైన శ్రీ క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయం బఫర్‌జోన్‌లో ఉండడంతో గత 9వ తేదీ నుంచి ఆలయాన్ని మూసి ఉంచారు. గ్రహణా నం తరం ఆ ఆలయాల్లో సంప్రోక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. మద్ది ఆల యంలో సోమవారం ఉదయం 6 గంటల నుంచి భక్తులకు స్వామి దర్శనం కల్పిస్తామని ఈవో పెన్మెత్స విశ్వనాఽథరాజు తెలిపారు. కామవరపుకోట మండలం తడికలపూడి గాంగేశ్వరాలయం, వీరభద్రస్వామి ఆలయాలతో పాటు గ్రామాల్లో అన్ని ఆలయాలు మూతబడ్టాయి.


భవిష్యత్‌లో మంచి పార్టీ అధికారంలోకి రావాలని ఆచంట మండలం వల్లూరు ఆంజనేయస్వామి ఆలయంలో జనసేన నాయకులు జప కార్యక్రమాలు చేపట్టారు. కొవ్వూరు గోష్పాదక్షేత్రం భక్తజనంతో కిటకిటలాడింది. ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వేద పండితులు, బ్రాహ్మణులు జపాలు చేశారు. గ్రహణానంతరం భక్తులు గోదావరిలో స్నానాలు చేశారు.


Updated Date - 2020-06-22T11:19:29+05:30 IST