3 నెలలుగా ఇదే తీరు..

ABN , First Publish Date - 2020-12-19T05:55:38+05:30 IST

నిడదవోలు–పంగిడి వయా చాగల్లు మెయిన్‌ రోడ్డుపై వాహన చోదకులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డు నిర్మాణంలో ఉండటంతో వాహనాల రాకపోకలకు వన్‌వేగా మారింది.

3 నెలలుగా ఇదే తీరు..
బ్రాహ్మణగూడెంలో మెయిన్‌రోడ్డుపై నిలిచిన ట్రాఫిక్‌

ట్రాఫిక్‌ జామ్‌తో ప్రజల వెతలు

శుక్రవారం 2 గంటలు నిలిచిన వాహనాలు

రోడ్డు నిర్మాణంతో ప్రజల పాట్లు

చాగల్లు, డిసెంబరు 18: నిడదవోలు–పంగిడి వయా చాగల్లు మెయిన్‌ రోడ్డుపై వాహన చోదకులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డు నిర్మాణంలో ఉండటంతో వాహనాల రాకపోకలకు వన్‌వేగా మారింది.  గోతులతో, రోడ్డు నిర్మాణ సామగ్రితో,   పనివారితో నిండి ఉండి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. శుక్రవారం బ్రాహ్మణగూడెంలో సుమారు రెండు గంటలకు పైగా వాహనాలు నిలిచిపోయాయి.  పోలీసులు సైతం ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ గురించి పట్టించుకోవడం లేదు. దీంతో మూడు నెలలుగా ట్రాఫిక్‌ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  సంబంధిత అధికారులు  చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 


Read more