పింఛన్ల పంపిణీలో తాడేపల్లిగూడెం ఫస్ట్
ABN , First Publish Date - 2020-12-02T04:53:10+05:30 IST
పింఛన్ల పంపిణీలో ప్రతీ నెల మాదిరి గానే ఈ నెల కూడా తాడేపల్లిగూడెం ముందు వరుసలో నిలిచింది.

తాడేపల్లిగూడెం రూరల్, డిసెంబరు 1 : పింఛన్ల పంపిణీలో ప్రతీ నెల మాదిరి గానే ఈ నెల కూడా తాడేపల్లిగూడెం ముందు వరుసలో నిలిచింది. ఉద యం 6 గంటలకే 85 శాతం పింఛన్లు పంపిణీ చేసి జిల్లాలోనే మొదటి స్థానంలో కొన సాగింది.మండలంలోని 31 గ్రామాల్లో పింఛన్లు పంపిణీ చేశారు. ఈవోపీఆర్డీ కొయ్యే వెంకట్రావు చినతాడేపల్లిలో పర్యవేక్షించారు.