మీ సెంటర్‌ను మరిచారా!

ABN , First Publish Date - 2020-12-02T04:55:27+05:30 IST

పెంటపాడు వెళ్లి ఎవరైనా గాంధీ బొమ్మ సెంటర్‌ అన్నారంటే చాలు అడ్రస్‌ టక్కున చెబుతారు.. పెంటపాడు వాళ్లు ఎక్కడికైనా వెళ్లినా ల్యాండ్‌ మార్కుగా అదే చెబుతారు. అటువంటి సెంటర్‌ను పట్టించుకు నేవారే కరుయ్యారు.

మీ సెంటర్‌ను మరిచారా!
శిథిలావస్థలో ఉన్న షెల్టర్‌, విగ్రహాలు

గాంధీ బొమ్మ సెంటర్‌లో విగ్రహాలు శిథిలం

కూలడానికి సిద్ధంగా ఉన్న షెల్టర్‌

కన్నెత్తి చూడని నాయకులు..అధికారులు

పెంటపాడు, డిసెంబరు 1 : పెంటపాడు వెళ్లి ఎవరైనా గాంధీ బొమ్మ సెంటర్‌ అన్నారంటే చాలు అడ్రస్‌ టక్కున చెబుతారు.. పెంటపాడు వాళ్లు ఎక్కడికైనా వెళ్లినా ల్యాండ్‌ మార్కుగా అదే చెబుతారు. అటువంటి సెంటర్‌ను పట్టించుకు నేవారే కరుయ్యారు. అటు అధికారులు కానీ.. ఇటు పాలకులు కానీ అటువైపు కన్నెత్తి చూడడం లేదు. మాజీ సర్పంచ్‌ నల్లమల్లి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో 1985వ సంవత్సరంలో ప్రజాసహకారంతో పెంటపాడు సెంటర్‌లో జాతిపిత మహాత్మగాంధీ, మాజీ ప్రధానులు జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీ విగ్రహాలను ప్రతిష్ఠించారు. నాటి నుంచి ఆ సెం టర్‌కు గాంధీ బొమ్మ సెంటర్‌గా పేరొచ్చింది..గతంలో గాంధీ, నెహ్రూ, ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా విగ్రహాలకు రంగులు వేసి పూల దండలు వేసే వారు. ప్రతీ ఏడాది ఆ విగ్రహాలను అందంగా ముస్తాబు చేసేవారు. అయితే సంవత్సరాలు గడిచిపోవడంతో వాటిని కన్నెత్తి చూసేవారే కరువ య్యారు.ఆ నాయకుల జయంతి రోజున దండ వేయ డం కూడా మర్చి పోతున్నారు. మరో పక్క విగ్రహాలు దుమ్ము పట్టిపో వడంతో పాటు కట్టడం శిఽథిలావస్థకు చేరుకుని ఎప్పుడు పడిపోతుందో అన్నట్టుగా ప్రమాదకరంగా తయారైంది.ఇప్పటికే కట్టడం పైకి వెళ్లే మెట్లు పూర్తిగా విరిగి పోయాయి.విగ్రహాలు దుమ్ము పట్టి గుర్తుపట్ట లేని విధంగా తయార య్యాయి.ఇప్పటికైనా దాతలు పట్టించుకుని విగ్రహాలను బాగుచేయించి.. కట్టడానికి మరమ్మతులు చేయించి చేసి పూర్వవైభవం తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.


Updated Date - 2020-12-02T04:55:27+05:30 IST