కొవ్వూరులో 13 నుంచి దస్తావేజు లేఖర్ల పెన్‌డౌన్‌

ABN , First Publish Date - 2020-07-10T11:16:32+05:30 IST

కొవ్వూరు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం వద్ద పనిచేస్తున్న దస్తావేజు లేఖర్లు ఈ నెల 13 నుంచి 21వ తేదీ వరకు ..

కొవ్వూరులో 13 నుంచి దస్తావేజు లేఖర్ల పెన్‌డౌన్‌

కొవ్వూరు, జూలై 9 : కొవ్వూరు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం వద్ద పనిచేస్తున్న దస్తావేజు లేఖర్లు ఈ నెల 13 నుంచి 21వ తేదీ వరకు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటిస్తున్నట్టు సంఘ అధ్యక్షుడు కొప్పినీడి త్రిమూర్తులు తెలిపారు.ఈ మేరకు గురువారం జరి గిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.కొవ్వూరు పట్టణ, పరిసర గ్రామాల్లో  వైరస్‌ వ్యాప్తి చెందుతున్నందున దస్తావేజు లేఖర్లు విధులకు దూరంగా ఉండాలని తీర్మా నించామన్నారు.ఈ నెల 22న మళ్లీ విధులకు హాజరు కావడం జరుగుతుందన్నారు.సమావేశంలో పి.రవి కిషోర్‌, పి. సత్యనారాయణ, ముప్పిడి నాగేశ్వరరావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-10T11:16:32+05:30 IST