ప్రైవేటు టీచర్లు, అధ్యాపకులకు జీతాలు ఇప్పించండి

ABN , First Publish Date - 2020-06-23T10:57:04+05:30 IST

లాక్‌డౌన్‌ కారణంగా మూతపడిన ప్రైవేటు విద్యాసంస్థలు సిబ్బందికి వేతనాలు ఇవ్వకుండా వేధిస్తున్నాయని మార్చి, ఏప్రిల్‌ నెలల ..

ప్రైవేటు టీచర్లు, అధ్యాపకులకు జీతాలు ఇప్పించండి

ఏలూరు ఎడ్యుకేషన్‌, జూన్‌ 22 : లాక్‌డౌన్‌ కారణంగా మూతపడిన ప్రైవేటు విద్యాసంస్థలు సిబ్బందికి వేతనాలు ఇవ్వకుండా వేధిస్తున్నాయని మార్చి, ఏప్రిల్‌ నెలల జీతాలు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని, ప్రభు త్వ పరంగా ఆర్థిక సాయం చేయాలని  అభ్యర్థిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేటు టీచర్లు, అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.అంబేడ్కర్‌, ఉపాధ్యక్షుడు డి.కృష్ణారావు తదితరులు సోమవారం కలెక్టరేట్‌కు విచ్చేసిన మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తానేటి వనితలకు వినతి పత్రాలు అంద జేశారు.


జిల్లాలో ఇటీవల మొగల్తూరులోని ఒక ప్రైవేటు పాఠశాల ఉపా ధ్యాయుడు కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుని మరణించాడని మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. తమ సమస్యలపై స్పందిం చిన మంత్రులు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రైవేటు విద్యా సంస్థల నుంచి మార్చి, ఏప్రిల్‌లతో పాటు మే నెల జీతాలు ఇప్పించే  బాధ్య తను తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. మంత్రులను కలిసిన వారిలో సంఘ ఏలూరు నగర శాఖ అధ్యక్షుడు ప్రభాకర్‌, జిల్లా ఉపాధ్యక్షుడు జయప్రకాశ్‌,  ప్రధాన కార్యదర్శి దాసు తదితరులు ఉన్నారు. 

Read more