మహోన్నత వ్యక్తి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌

ABN , First Publish Date - 2020-11-01T05:22:50+05:30 IST

దేశ సమైక్యతకు, సార్వ భౌమత్వానికి భంగం వాటిల ్లకుండా జాతిని ఏకం చేస్తూ అఖండ భారతావనిని ఒక్క తాటిపైకి తేవడంలో అవిరళ కృషి చేసిన మహోన్నతవ్యక్తి, నాయకుడు సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అంటూ జిల్లా ఎస్పీ కె.నారాయణ నాయక్‌ కొనియాడారు.

మహోన్నత వ్యక్తి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌
నివాళులర్పిస్తున్న జిల్లా ఎస్పీ కె.నారాయణ నాయక్‌

ఏలూరు క్రైం, అక్టోబరు 31: దేశ సమైక్యతకు, సార్వ భౌమత్వానికి భంగం వాటిల ్లకుండా జాతిని ఏకం చేస్తూ అఖండ భారతావనిని ఒక్క తాటిపైకి తేవడంలో అవిరళ కృషి చేసిన మహోన్నతవ్యక్తి, నాయకుడు సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అంటూ జిల్లా ఎస్పీ కె.నారాయణ నాయక్‌ కొనియాడారు. భారత తొలి ఉప ప్రధాని, హోం మంత్రి, ఉక్కుమనిషి సర్ధార్‌ వల్లభాయ్‌పటేల్‌ 145వ జయంతిని ఏలూ రులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. వల్లభాయ్‌ పటేల్‌ చిత్రపటానికి  పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా అదనపు ఎస్పీ ఏవీ సుబ్బరాజు, ఏఆర్‌ డీఎస్పీ కృష్ణంరాజు, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్‌.నాగేశ్వ రరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 

Read more