ఉక్కు మనిషి వల్లభాయ్‌ పటేల్‌

ABN , First Publish Date - 2020-11-01T04:53:37+05:30 IST

భారత స్వాత్రంత్య్ర పోరాటంలో దీటుగా నిలిచి ఉక్కుమనిషిగా కీర్తిని పొందిన సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ సేవలు మరువలేనివని డీసీ ఎంఎస్‌ చైర్మన్‌ యడ్ల తాతాజీ అన్నారు.

ఉక్కు మనిషి వల్లభాయ్‌ పటేల్‌
పాలకొల్లులో జరిగిన పటేల్‌ జయంతి కార్యక్రమంలో విద్యార్థులు

పాలకొల్లు అర్బన్‌, అక్టోబరు 31: భారత స్వాత్రంత్య్ర పోరాటంలో దీటుగా నిలిచి ఉక్కుమనిషిగా కీర్తిని పొందిన సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ సేవలు మరువలేనివని డీసీ ఎంఎస్‌ చైర్మన్‌ యడ్ల తాతాజీ అన్నారు. వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా కొత్తపేట మునిసిపల్‌ పాఠశాలలో శనివారం జరిగిన కార్యక్రమంలో తాతాజీ మాట్లా డారు. వల్లభాయ్‌ పటేల్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పాఠశాల హెచ్‌ఎం రాయపూడి భవాని ప్రసాద్‌, ఉపాధ్యాయురాలు పి.శ్రీదేవి, పిల్లా శ్రీనివాసరావు, తలుపూరి భుజంగరావు, చెన్నూరి విజయ్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు పెన్సిల్స్‌, పెన్నులు తాతాజీ చేతుల మీదుగా అందజేశారు.

Read more