ఎలా వచ్చింది ?

ABN , First Publish Date - 2020-12-07T05:44:37+05:30 IST

ఏలూరు నగ రాన్ని రెండు రోజులుగా కుదిపేస్తున్న ఆకస్మిక వ్యాధి కార కాలపై వైద్య ఆరోగ్య శాఖ, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) బృందాలు విశ్లేషణలు ప్రారంభించాయి.

ఎలా వచ్చింది ?
ఏలూరులో స్ప్రహ తప్పిన బాలుడిని ఆస్పత్రికి తరలిస్తున్న తల్లి

ఏలూరులో అంతుచిక్కని వ్యాధిపై విశ్లేషణలు

ఏలూరు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 6 : ఏలూరు నగ రాన్ని రెండు రోజులుగా కుదిపేస్తున్న ఆకస్మిక వ్యాధి కార కాలపై వైద్య ఆరోగ్య శాఖ, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) బృందాలు విశ్లేషణలు ప్రారంభించాయి. పీసీబీకి చెందిన పది మంది అధికారులు, ఉద్యోగులు శనివారం రాత్రి నుంచే క్షేత్ర స్థాయి పరిశీలన ప్రారంభించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఎపిడిమాలజీ విభాగం రాష్ట్ర వైద్య నిపుణుల బృందం ఆదివారం ఏలూరు చేరుకుంది. ఆకస్మిక వ్యాధికి పారిశ్రామిక వాయు కాలుష్యం కారణం కాదని నిర్ధారణకు వచ్చినట్టు పీసీబీ ఇన్‌చార్జి ఎన్విరాన్‌ మెంటల్‌ ఇంజనీర్‌ (ఈఈ) సరిత వెల్లడించారు. వాయు కాలుష్యం ద్వారా వచ్చే అవకాశాలపై నిగ్గు తేల్చేందుకు దక్షిణపువీధి, పడమర వీధి, టూటౌన్‌ ప్రాంతాల్లో ఎయిర్‌ క్వాలిటీ మిషన్లు అమర్చారు. వీటి నుంచి ఫలితాలు సోమవారం వస్తాయి. పీసీబీ సేకరి ంచిన తాగునీటి నమూనాలను విశ్లేషణ నిమిత్తం విశాఖప ట్నం, విజయ వాడల్లోని ల్యాబ్‌లకు పంపించారు. వైరల్‌ ఇన్వెస్టిగేషన్స్‌కు బాధితుల నుంచి సేకరించిన నమూనాలను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. ఈ నేపథ్యంలో ఆహార కాలుష్యం, హై మెటల్‌ పాయిజన్‌ వంటి అంశాల పైనా ఎపిడిమాలజీ జిల్లా బృందాలు దృష్టి కేంద్రీకరించాయి. వన్‌టౌన్‌ ప్రాంతంలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ వల్ల, పరిసర ప్రాంతాలు వాయుకాలుష్యం బారిన పడడంతో పాటు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న బలహీనులపై ఒకింత ప్రభావం చూపే అవకాశాలున్నా యని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి వెల్లడిం చారు. దీంతో పాటు దోమ కాటు కూడా కాదన లేమం టున్నారు.ఈ వాదనలన్నింటిపైనా అధికారులు తమ విశ్లేషణల్లో నిర్ధారణకు రావాల్సి ఉంది. కేసులు నమోదైన ప్రాంతాలన్నీ వన్‌టౌన్‌తో పాటు టూటౌన్‌లోని తమ్మిలేరు ఏటిగట్టు వెంబడి పరిసర ప్రాంతాల్లోనూ, మురికివాడ ల్లోనూ ఉండడం గమనార్హం. 

Updated Date - 2020-12-07T05:44:37+05:30 IST