వందేళ్ల ఏఐటీయూసీ

ABN , First Publish Date - 2020-11-01T05:00:48+05:30 IST

ఏఐటీయూసీ శతాబ్ధి ఉత్సవాలను శనివారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. మునిసిపాల్టీ, ఆర్టీసీ, కొబ్బరి దింపు కార్మిక సంఘాల అధ్వర్యంలో పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.

వందేళ్ల ఏఐటీయూసీ
నరసాపురంలో నినాదాలు చేస్తున్న ఏఐటీయూసీ కార్యకర్తలు

నరసాపురం, అక్టోబరు 31 : ఏఐటీయూసీ శతాబ్ధి ఉత్సవాలను శనివారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. మునిసిపాల్టీ, ఆర్టీసీ, కొబ్బరి దింపు కార్మిక సంఘాల అధ్వర్యంలో పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర నాయకుడు నెక్కంటి సుబ్బారావు మాట్లాడుతూ వందేళ్ల చరిత్ర కలిగిన కార్మిక సంఘం కార్మికుల హక్కుల కోసం అనేక పోరాటాలు చేసిందన్నారు. ఆరేటి మృంత్యుజంయ, నెక్కంటి క్రాంతికుమార్‌, నీలపు ప్రసాద్‌, ఎవీరావు, నర్సింహారావు, జక్కంశెట్టి రామకృష్ణ  తదితరులు పాల్గొన్నారు.

Read more