రూ. 36.75 లక్షల రికవరీకి ఆదేశాలు

ABN , First Publish Date - 2020-11-26T05:07:05+05:30 IST

ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీల్లో అవకతవకలు జరిగిన రూ.36,75,074లను రికవరీ చేసేందుకు ఆదేశాలు జారీ చేశామని డ్వామా అడిషనల్‌ పీడీ పి.కుమార్‌రాజా తెలిపారు.

రూ. 36.75 లక్షల రికవరీకి ఆదేశాలు

టి.నరసాపురం, నవంబరు 25 : ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీల్లో అవకతవకలు జరిగిన రూ.36,75,074లను రికవరీ చేసేందుకు ఆదేశాలు జారీ చేశామని డ్వామా అడిషనల్‌ పీడీ పి.కుమార్‌రాజా తెలిపారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం ఏపీ సామాజిక తనిఖీ ప్రజా వేదిక బుధవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పీడీ మాట్లాడుతూ 15 గ్రామ పంచాయతీల్లో 2017–18, 2018–19 సంవత్సరాల్లో రూ.14కోట్ల30లక్షల24వేల436 విలువైన పనులు చేపట్టగా విచారణ అనంతరం రూ.36,75,074 అవకతవకలు జరిగినట్టు నిర్ధారించి రికవరీ చేసేందుకు ఆదేశించామన్నారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సామంతపూడి బాలసూర్యనారాయణరాజు, అసిస్టెంట్‌ విజిలెన్స్‌ అధికారి పి.ఈశ్వరరావు, ఐఎంటీ ఎస్‌.రాజు, ఎంపీడీవో కేపీ కామేశ్వరి, మండల కన్వీనర్‌ శ్రీనురాజు పాల్గొన్నారు. 

Read more