ప్రభుత్వ నర్సింగ్ స్కూల్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్
ABN , First Publish Date - 2020-07-08T11:20:25+05:30 IST
ఏలూరులో నిర్వహిస్తున్న ప్రభుత్వ నర్సింగ్ స్కూల్‌లో ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ప్రిన్సిపాల్, వైఎస్ ప్రిన్సిపాల్

ఏలూరు ఎడ్యుకేషన్, జూలై 7 : ఏలూరులో నిర్వహిస్తున్న ప్రభుత్వ నర్సింగ్ స్కూల్‌లో ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ప్రిన్సిపాల్, వైఎస్ ప్రిన్సిపాల్ ఒకొక్కటి చొప్పున పదోన్నతిపై భర్తీ చేస్తారు. నర్సింగ్ ట్యూటర్ (గ్రేడ్-2) 12 పోస్టులను పదోన్నతిపై భర్తీ చేస్తారు.వీటితో పాటు ఆఫీస్ సూపరిం టెండెంట్, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్ల నియామకాలు జరుగుతాయి.
ఔట్‌సోర్సి ంగ్ విధానంలో ఒక టైపిస్టు కం డేటా ఎంట్రీ ఆపరేటర్, రెండు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, హౌస్ కీపర్ పోస్టులు రెండు, ఒక ఎలక్ట్రీషియన్, నలుగురు అటెండర్లు, ఒక హెవీ వెహికల్ డ్రైవర్, మూడు వాచ్ మెన్ పోస్టులు, ఒక క్లీనర్ పోస్టు, మూడు స్వీపర్ పోస్టులు, రెండు ల్యాబ్ అటెండెన్స్ పోస్టులు, రెండు కుక్ పోస్టులు,ఆరు కిచెన్ బాయిస్ పోస్టులు, ఒక ధోబీ, మూడు తోటీ పోస్టులను భర్తీ చేస్తారు.నాన్‌టీచింగ్ స్టాఫ్ పోస్టులు 35, టీచింగ్ స్టాఫ్ 14 భర్తీ చేయనున్నారు.