-
-
Home » Andhra Pradesh » West Godavari » Notification for Inter and Degree Admissions
-
గురుకులాల ఇంటర్, డిగ్రీ అడ్మిషన్‌లకు నోటిఫికేషన్
ABN , First Publish Date - 2020-03-24T11:29:14+05:30 IST
ఏపీ గురుకుల జూని యర్, డిగ్రీ కళాశాలల ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నామని

టి.నరసాపురం, మార్చి 23 : ఏపీ గురుకుల జూని యర్, డిగ్రీ కళాశాలల ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నామని అప్పలరాజుగూడెం గురు కుల పాఠశాల ప్రిన్సిపాల్, జిల్లా కోఆర్డినేటర్ టి.నరసింహ స్వామి తెలిపారు. సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు జనరల్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో 2020-21 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరంలో ప్రవేశం కోసం మే 14వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాయబోతున్న 13 జిల్లాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల, నాగార్జునసాగర్, సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల కోఆర్డినేషన్ కర్నూలు 2020-21 విద్యాసంవత్సరంలో డిగ్రీ మొదటి ఏడాది ప్రవేశానికి ఇంటర్మీడియేట్, రెండవ సంవత్సరం 2020 మార్చి పరీక్షలకు హాజరైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ దరఖాస్తులు ఈనెల 23వ తేదీ నుంచి ఏప్రియల్ 22వ తేదీ వరకు ఆన్‌లైన్ వెబ్‌సైట్ ్చఞట్జఛీఛి,్చఞఛిజటట.జీుఽ కు దరఖాస్తు చేసు కోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 91003 32106, 70933 23250 నెంబర్లను సంప్రదించాలన్నారు.