ఎడతెరపిలేని వర్షం
ABN , First Publish Date - 2020-11-27T05:04:49+05:30 IST
నివర్ తుఫాన్ వల్ల మెట్ట ప్రాంతమైన చింతలపూడిలో ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి.

చింతలపూడి, నవంబరు 26 : నివర్ తుఫాన్ వల్ల మెట్ట ప్రాంతమైన చింతలపూడిలో ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి. చేతికి వచ్చిన వరి పంట పొలాల్లో నేల వాలిపోతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొంతమంది మిషన్ల ద్వారా మాసూళ్లు చేసిన ధాన్యాన్ని ఆరబోసినప్పటికీ వర్షానికి తడవకుండా కప్పేందుకు బరకాల కోసం పరుగులు పెడుతున్నారు. నానుడి వర్షంతో పాటు చలి ఎక్కువగా ఉండడంతో గురువారం మధ్యాహ్నం నుంచి రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.
జీలుగుమిల్లి : మెట్ట ప్రాంతంలో వరితోపాటు వర్జీనియా పొగాకు, మిర్చి పంటలు గురువారం కురిసిన వర్షానికి దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. బర్రింకలపాడులో కోసిన వరి పనలు తడిసి ముద్దయ్యాయి. నేల వాలిన చేలు తడిచి మొలకలు వస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.