ప్రజా దోపిడీ జీవోలను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2020-12-12T04:28:33+05:30 IST

ఏపీ మునిసిపల్‌ చట్టాల సవరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా దోపిడీ జీవోలు 196, 197,198లను వెంటనే రద్దు చేయాలని తణుకు పట్టణ తెదేపా అధ్యక్షుడు కలగర వెంకటకృష్ణ ప్రభు త్వాన్ని డిమాండ్‌ చేశారు.

ప్రజా దోపిడీ జీవోలను రద్దు చేయాలి
మునిసిపల్‌ కార్యాలయం వద్ద టీడీపీ నాయకుల నిరసన ప్రదర్శన

196,197,198 జీవోలపై టీడీపీ నాయకుల నిరసన

తణుకు, డిసెంబరు 11 : ఏపీ మునిసిపల్‌ చట్టాల సవరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా దోపిడీ జీవోలు 196, 197,198లను వెంటనే రద్దు చేయాలని తణుకు పట్టణ తెదేపా అధ్యక్షుడు కలగర వెంకటకృష్ణ ప్రభు త్వాన్ని డిమాండ్‌ చేశారు. తణుకు మునిసిపల్‌ కార్యాలయం వద్ద జీవోలను రద్దు చేయాలంటూ శుక్రవారం నిరసన ప్రదర్శన చేశారు. ఇప్పటి వరకూ అద్దె విలువ ఆధారంగా పన్ను వేసేవారని.. వైసీపీ ప్రభుత్వం ఆస్తి విలువ.. ఇంటి నిర్మాణ విలువ కలిపి పన్ను వేయడం వల్ల ప్రజలపై  20 రెట్లు భారం పడుతుందన్నారు. ప్రతీ సంవత్సరం భూముల విలువతో పాటు పన్ను విలువ కూడా పెరుగుతూ పోతుందన్నారు. మంచినీటి పన్ను నెలకు రూ.100 నుంచి రూ.350 వరకూ వసూలు చేసే నిర్ణయం, మీటర్ల విధానాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రజల నుంచి పారిశుధ్య భూగర్భ డ్రెయినేజీ నిర్వహణకు అయ్యే ఖర్చు మొత్తం వసూలు చేసేలా జీవోలు ఉన్నాయన్నారు. ప్రజలపై భారం మోపే జీవోలనుఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మునిసిపల్‌ కమిషనర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ మాజీ చైర్మన్లు పరిమి వెంకన్నబాబు, దొమ్మేటి వెంకట సుధాకర్‌, ఏఎంసీ మాజీ చైర్మన్లు బసవా రామకృష్ణ, తోట సూర్యనారాయణ,నాయకులు దూలం చిట్టిపాప, ఎలుబూడి ఈశ్వరరావు, తణుకు రేవతి, తేతలి సాయి, తాతపూడి మారుతీరావు, సన్యాసిరావు, వల్లూరి గంగయ్య పాల్గొన్నారు.

Updated Date - 2020-12-12T04:28:33+05:30 IST