కాశీ టు కరోనా

ABN , First Publish Date - 2020-05-09T08:14:45+05:30 IST

జిల్లాలో ఐదు రోజులపాటు కరోనా పాజిటివ్‌ కేసులు నమో దు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స

కాశీ టు కరోనా

ఒకే రోజు తొమ్మిది మందికి పాజిటివ్‌

క్వారంటైన్‌ నుంచి ఆసుపత్రికే..

పోలీసు తనిఖీలతో తప్పిన ముప్పు

అందరూ 60 ఏళ్ల పైబడిన వారే

జిల్లాలో 68కి చేరిన కేసులు

33 మంది డిశ్చార్జ్‌.. 35 మందికి చికిత్స 


(ఏలూరు-ఆంధ్రజ్యోతి ప్రతినిధి): 

జిల్లాలో ఐదు రోజులపాటు కరోనా పాజిటివ్‌ కేసులు నమో దు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకుని తిరిగి వెళ్లే వారి సంఖ్య పెరిగింది. వైరస్‌ తీవ్రత వున్న ప్రాంతాల్లో కరోనా కట్టడికి వచ్చిందనుకు న్న క్షణాల్లో జిల్లాలో తొమ్మిది పాజిటివ్‌ కేసులు నమోదయ్యా యి. కాశీ వెళ్లి తిరిగి వచ్చిన వారికి వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 68కి పెరిగింది. కాశీకి వెళ్లి వచ్చిన వారు స్వస్థలాలకు చేరక ముందే నేరుగా క్వారంటైన్‌కు అక్కడ నుంచి ఆసుపత్రికి తరలించారు. వారంతా కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకోవడానికి లాక్‌డౌన్‌ ప్రకటనకు నాలుగు రోజుల ముందు అక్కడికి చేరు కున్నారు. ఆయా పరిసరాల్లో పుణ్యక్షేత్రాలను సందర్శించిన తర్వాత లాక్‌ డౌన్‌ అమలులోకి రావడంతో షాక్‌కు గురయ్యా రు. నెల రోజుల అష్టకష్టాలను అనుభవించి, చివరకు ఒక క్యాబ్‌ మాట్లాడుకుని ఈ నెల నాలుగో తేదీన రాజమహేంద్ర వరం చేరుకున్నారు.


వారంతా కాశీ నుంచి స్వస్థలాలకు వస్తు న్నట్లు తేలడంతో వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు భీమడోలు లోని క్వారంటైన్‌కు తరలించారు. అక్కడి నుంచి తాడేపల్లి గూడెం క్వారంటైన్‌కు పంపి శ్వాబ్‌ పరీక్షలు నిర్వహించారు. వారిలో తొమ్మిది మందికి కరోనా పాజిటివ్‌గా శుక్రవారం నిర్ధా రణ అయింది. నిడదవోలు మండలానికి చెందిన ఇద్దరు, ఉండ్రాజవరం మండలానికి చెందిన ఐదుగురు, గోపాలపురా నికి చెందిన ఒకరు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన క్యాబ్‌ డ్రైవర్‌ పాజిటివ్‌ వచ్చిన వారిలో ఉన్నారు. కాశీకి వెళ్ళిన మొత్తం 12 మందిలో ముగ్గురికి పరీ క్షల్లో నెగెటివ్‌ వచ్చింది. లాక్‌డౌన్‌కు ముందే కాశీ వెళ్లిన వారు కరోనా బారినపడ్డారు. వారంతా ప్రస్తుతం ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలో చేరారు.


వారు ప్రయా ణిస్తున్న వాహనాన్ని రాజమహేంద్రవరంలో ఆపి అప్పటి కప్పుడే భీమడోలు క్వారంటైన్‌కు పంపడంతో పెనుముప్పు తప్పింది. వారు స్వస్థలాలకు చేరితే దాదాపు ఆరు ప్రాంతాల్లో కరోనా మరింత విస్తరించి ఉండేది. వారంతా స్వస్థలాలకు చేరాలను ఆతృతలో ఎక్కడా ఆగకుండా ప్రయాణం చేయడం తో వారి ద్వారా ఎవరికీ కరోనా వ్యాపించే అవకాశం లేదని తేలింది. అధికారులు దీనిపై ఒక స్పష్టత ఇవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 


వయసు పైబడిన వారే

కాశీ యాత్ర బృందంలో కరోనా బారిన పడిన వారిలో ఆరు పదుల వయసు పైబడిన వారు ఎక్కువ. 70 ఏళ్లు పైబడిన వారు ముగ్గురు, 60 పైబడిన వారు ఐదుగురు ఉన్నారు. వారందరికీ ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. వయస్సు పైబడిన వారిపై కరోనా వైరస్‌ దాడి తీవ్రస్థాయిలో ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని వారందరికీ ఐదు రోజుల క్రితమే చికిత్స ఆరంభించారు. తగ్గట్టుగానే పరీక్షల్లో పాజిటివ్‌ తేలడం తో ఆశ్రం ఐసొలేషన్‌ వార్డుకు తరలించారు. ఉండ్రాజవరానికి చెందిన ఒక మహిళ మాత్రం 50 ఏళ్లకు దిగువన వయస్సు ఉన్న ఏకైక వ్యక్తి. ఉండ్రాజవరం మండలానికి చెందిన ఐదు గురు, మిగతా నలుగురు పూర్తిగా వృద్ధులే. 


డిశ్చార్జ్‌లు.. కొత్త కేసులు

జిల్లాలో కరోనా కేసుల నమోదు గమ్మత్తుగా ఉంది. కొద్ది రోజులపాటు ఒక్క కేసు నమోదు కాకపోవడం, తర్వాత ఒకే సారి ఎక్కువగా నమోదు కావడం పరిపాటిగా మారింది. ఐదు రోజులుగా కేసులు లేకపోవడంతో పెద్ద సంఖ్య నమోదు కాబోతుందనే వాదన నిజమైంది. ఇవాళో రేపో దాదాపు పది మంది డిశ్చార్జ్‌ అయ్యే అవకాశాలున్నాయి. వారు కోలుకోవ డంతో తుది పరీక్ష ఫలితాలు వచ్చిన తరువాత ఇళ్లకు పంపా లని భావిస్తున్నారు. కరోనా పరీక్షలు ఇప్పటికే భారీగా పెండిం గ్‌లో ఉన్నాయి. ఏరోజుకారోజు నమూ నాలు సేకరించి పరీక్షల కు పంపుతున్నారు. వలస కార్మికులు ఏదో రూపంలో జిల్లాకు చేరుతుండడంతో మిగిలిన వారంతా గందగోళంలో పడ్డారు.  వలస కార్మికులందరికీ పరీక్షలు నిర్వహించడం, క్వారంటైన్‌కు చేర్చిన తర్వాతే అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు.


18 మంది క్వారంటైన్‌కు తరలింపు

కొవ్వూరు : తెలంగాణలోని నాగర్‌ కర్నూలు నుంచి కొవ్వూ రు మండలం ఆరికరేవులలంక గ్రామానికి వచ్చిన 18 మంది ని క్వారంటైన్‌కు తరలించామని ఆర్డీవో లక్ష్మారెడ్డి తెలిపారు. చేపల వేట చేస్తూ జీవనం సాగిస్తున్న కొవ్వూరు మండలానికి చెందిన పది మందిని, ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన ఎనిమిది మంది ఇటీవల వచ్చారు. ముందుజాగ్రత్త చర్యగా వీరిని క్వారం టైన్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. 


సంపూర్ణ ఆరోగ్యంతో ఒకరు డిశ్చార్జ్‌

ఏలూరు ఫైర్‌స్టేషన్‌: ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలో కరో నా పాజిటివ్‌ చికిత్స పొందుతున్న నరసాపురానికి చెందిన ఒక వ్యక్తిని శుక్రవారం డిశ్చార్జ్‌ చేశారు. 14 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన ఈ వ్యక్తి చికిత్స అనంతరం పరీక్షలు నిర్వహించగా రెండుసార్లు నెగెటివ్‌గా రావడంతో ఇంటికి పంపించారు. ఇప్పటికే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 33కు చేరింది. ఇక్కడ 19 మంది, విజయవా డలో ఏడుగురు మంది చికిత్స పొందుతుండగా తాజాగా మరో తొమ్మిది మందికి పాజిటివ్‌ రావడంతో.. ఈ సంఖ్య 35 మందికి చేరింది. రాబోయే రోజుల్లో మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. 


కొవిడ్‌ స్పెషల్‌ ఆఫీసర్‌గా డాక్టర్‌ మోహన్‌ 

ఏలూరు ఎడ్యుకేషన్‌ : ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి, ఆశ్రం ఆసుపత్రిలకు కొవిడ్‌ జిల్లాస్థాయి ప్రత్యేకాధికారిగా డాక్టర్‌ ఏవీఆర్‌.మోహన్‌ను నియమిం చారు. కరోనా కేసులకు వైద్యం జరిగే విధానాల పర్యవేక్షణ, ఆరోగ్యం నిలకడగా లేని కేసులపై  తీసుకోవాల్సిన ప్రత్యేక శ్రద్ద ముఖ్యమైన ఆసుపత్రుల్లో కొవిడ్‌ ప్రోటోకాల్స్‌, అను మానితులు, పేషెంట్ల డిశ్చార్జ్‌ అంశాలు, ఆసుపత్రుల నిర్వ హణ తదితర అంశాలను ఈయన పర్యవేక్షిస్తుంటారు.  

Updated Date - 2020-05-09T08:14:45+05:30 IST