నిండా ముంచిన ఎర్రకాల్వ, యనమదుర్రు ఆందోళనలో రైతాంగం

ABN , First Publish Date - 2020-09-17T05:30:00+05:30 IST

యనమదుర్రు డ్రెయిన్‌ పొంగి ప్రవహించడంతో తిరుపతిపురం, వరిగేడు, రామచంద్రపురం గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

నిండా ముంచిన ఎర్రకాల్వ, యనమదుర్రు    ఆందోళనలో రైతాంగం

 అత్తిలి, సెప్టెంబరు 17 : యనమదుర్రు డ్రెయిన్‌ పొంగి ప్రవహించడంతో తిరుపతిపురం, వరిగేడు, రామచంద్రపురం గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తణుకు, అత్తిలి మండలాల ఆయకట్టు పరిధిలో దువ్వ, వరిగేడు, బల్లిపాడు, తిరుపతిపురం ప్రాంతాల నుంచి మురుగునీరు ఆరుదల కోడుకు వచ్చి చేరుతుంది.


రామచంద్రపురం వద్ద ఉన్న ఆరుదలకోడు డ్రెయిన్‌ నుంచి యనమదుర్రు డ్రెయిన్‌కు వరదనీరు పోటెత్తడంతో అవుట్‌ పాల్‌ స్లూయిజ్‌ తలుపులు గురువారం అధికారులు మూసి వేశారు. ఆరుదలకోడు స్లూయిజ్‌ గేట్లు పటిష్టంగా లేకపోవడంతో యనమదుర్రు  డ్రెయిన్‌ నీరు ఆరుదల కోడులోకి ఎగదన్నడంతో ముంపు తీవ్రత ఎక్కువైంది.


తిరుపతిపురం, వరిగేడు ఆయకట్టు పంట చేలు దాదాపు ముంపులో ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 

Updated Date - 2020-09-17T05:30:00+05:30 IST