ఎస్సీ, ఎస్టీలకు నూతన పారిశ్రామిక విధానం

ABN , First Publish Date - 2020-08-22T11:35:10+05:30 IST

ప్రభుత్వం ఎస్సీఎస్టీలను పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్లేవిధంగా చర్యలు తీసుకుంటుందని మంత్రి తానేటి వనిత అన్నారు.

ఎస్సీ, ఎస్టీలకు నూతన పారిశ్రామిక విధానం

తాడేపల్లిగూడెం రూరల్‌, ఆగస్టు 21: ప్రభుత్వం ఎస్సీఎస్టీలను పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్లేవిధంగా చర్యలు తీసుకుంటుందని మంత్రి తానేటి వనిత అన్నారు. తాడేపల్లిగూడెం లోని ఆమె నివాసం వద్ద శుక్రవారం జూమ్‌ యాప్‌ ద్వారా పారిశ్రామికవేత్తలతో చర్చించారు. పారిశ్రామిక విధానంలో ఎస్సీ, ఎస్టీలకు సబ్సిడీ పెంచడంతో పాటు మార్కెటింగ్‌ విషయంలో ప్రభుత్వం చొరవ చూపించాలన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ పేదలకు అండగా ఉండేందుకే ఈ పారిశ్రామిక విధానం అమలు చేసేందుకు ముందుకు వస్తున్నారన్నారు.

Updated Date - 2020-08-22T11:35:10+05:30 IST