రైతులకు జాతీయ పురస్కారాలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-08-01T11:05:11+05:30 IST

రైతు శాస్త్రవేత్తలకు జాతీయ స్థాయి జన్యు పరిరక్షణ్‌ పురస్కారం ఇచ్చి ప్రోత్సహిం చాలని వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్‌ టి.జానకిరామ్‌ సూచిం చారు.

రైతులకు జాతీయ పురస్కారాలు ఇవ్వాలి

వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయ ఉప కులపతి జానకిరామ్‌


తాడేపల్లిగూడెం రూరల్‌. జూలై 31 : రైతు శాస్త్రవేత్తలకు జాతీయ స్థాయి జన్యు పరిరక్షణ్‌ పురస్కారం ఇచ్చి ప్రోత్సహిం చాలని వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్‌ టి.జానకిరామ్‌ సూచిం చారు. జూమ్‌ యాప్‌ ద్వారా జన్యుసంపద నమోదు, మార్గదర్శకాలు అనే అంశంపై శుక్రవారం నిర్వహించిన సెమినార్‌లో పలు సూచనలు చేశారు.


నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ ప్లాంట్‌ జనటిక్‌ రిసోర్స్‌ (ఎన్‌బీపీజీఆర్‌), (పీపీవీ అండ్‌ ఎఫ్‌ఆర్‌)లో నూతన వంగడాలు ఆవిష్కరించే వారి వివరాలు నమోదు చేయించి వారికి తగిన గుర్తింపు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. యూనివర్సిటి స్థాయిలో తగు పరిశీలన, సాంకేతిక సలహాకు రెండు కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలి పారు. కార్యక్రమంలో సీనియర్‌ శాస్త్రవేత్తలు డాక్టర్‌ వీణాగుప్తా, డాక్టర్‌ అంజలి కాక్‌ కిల్‌, ఉద్యాన పరిశోధన సంచాలకులు డాక్టర్‌ ఆర్‌వీఎస్‌కే రెడ్డి, రిజిస్ర్టార్‌ డాక్టర్‌ కె.గోపాల్‌, డాక్టర్‌ బి శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-01T11:05:11+05:30 IST