బీసీలపై జగన్‌ ప్రభుత్వం చిన్నచూపు

ABN , First Publish Date - 2020-12-20T04:58:16+05:30 IST

జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే బీసీలకు 50శాతం రిజర్వేషన్లు ఇచ్చివారి జీవితాలను మార్చేస్తానని చెప్పారని, గద్దెనె క్కాక బీసీలపై వేటు వేస్తున్నారని నరసాపురం పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి విమర్శించారు.

బీసీలపై జగన్‌ ప్రభుత్వం చిన్నచూపు

నరసాపురం పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి

భీమవరం, డిసెంబరు 19 : జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే బీసీలకు 50శాతం రిజర్వేషన్లు ఇచ్చివారి జీవితాలను మార్చేస్తానని చెప్పారని, గద్దెనె క్కాక బీసీలపై వేటు వేస్తున్నారని నరసాపురం పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి విమర్శించారు. భీమవరంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. టీడీపీ హయాంలో బీసీలకు ఇచ్చిన విశ్వ విద్యాలయాల పదవుల నుండి టీటీడీ పోస్టుల వరకు రెడ్డి సామాజిక వర్గా నికే అత్యధికం కట్టబెట్టారన్నారు. బీసీ సామాజిక వర్గానికి మోసం చేశా రన్నారు. రాష్ట్రంలో నామినేటెడ్‌ పదవులను సైతం జగన్‌రెడ్డి సామాజిక వర్గా నికి కేటాయించారని, టీటీడీలో మొత్తం 36 మంది సభ్యులు ఉంటే 11 మంది రెడ్లు, ప్రభుత్వ సలహాదారుల్లో 17 మంది రెడ్డి సామాజిక వర్గానికి, ఇచ్చారన్నారు. 30 మంది ప్రభుత్వ న్యాయవాదులలో 16 మంది సీఎం సామాజిక వర్గానికి చెందిన వారేనన్నారు. బీసీ కార్పొరేషన్లు మినహాయించి ఇతర నామినేటెడ్‌ పోస్టులు, కార్పొరేషన్లు, దేవాలయ బోర్డు, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ పోస్టులు బీసీలకు సగం ఇస్తామని ప్రకటించి ఇప్పుడు మాట తప్పి, మడమ తిప్పారన్నారు. బీసీ సంక్రాంతి అని ప్రమాణ స్వీకారం చేయించిన వారికి కార్యాలయాలు, నిధులు లేకుండా ఉత్సవ విగ్రహాలు చేయటం బీసీలపై చిన్నచూపు కాదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్ధానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించడం వల్ల 16,800 పదవులు కోల్పోతున్నారు. నేతిబీర లాంటి 56 బీసీ కార్పొ రేషన్‌లో 672 డైరెక్టర్లు నియమించి అధికారం, నిధులు ఉన్న జడ్పీ, మండల పరిషత్‌, మేయర్లు, మున్సిపల్‌ ఛైర్మన్లు, సర్పంచ్‌లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు స్ధానంలో 16,800 పదవులకు కోత పెట్టారన్నారు. బీసీ సబ్‌ ప్లాన్‌కు స్వల్ప మొత్తం మాత్రమే ఖర్చు చేసి బీసీలకు ద్రోహం చేశారని తోట సీతారామలక్ష్మి విమర్శించారు.

Read more