ఓట్లేసిన ప్రజలపైనే కక్ష సాధింపు

ABN , First Publish Date - 2020-02-08T12:28:40+05:30 IST

ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానులు మారడం ఎప్పుడూ.. ఎక్కడా జరగలేదని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. మాజీ

ఓట్లేసిన ప్రజలపైనే కక్ష సాధింపు

జగన్‌ పాలనాతీరుపై మాజీ మంత్రి నక్కా ఆనందబాబు

కొవ్వూరు (చాగల్లు), ఫిబ్రవరి 7 : ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానులు మారడం ఎప్పుడూ.. ఎక్కడా జరగలేదని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ను ఆయన గృహంలో  కలిసి సంఘీభావం ప్రకటించారు. భారీ మెజారిటీ ఇచ్చి పాలించమని తీర్పు ఇచ్చిన ప్రజలపైనే సీఎం జగన్‌ కక్ష కట్టి ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. అమరావతి రైతులు చేపట్టిన ఉద్యమం 53వ రోజుకు చేరిందని ఉద్యమం ఎక్కడా సడలలేదన్నారు.కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ వారిపై అక్రమంగా పెట్టిన కేసులు తక్షణం ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.అధికారం అడ్డు పెట్టుకుని తప్పుడు కేసులు పెడితే తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరించారు.   

పార్టీ విభేదాలు అధిష్టానం పరిష్కరిస్తుంది

పార్టీ అంతర్గత విభేధాలను పార్టీ అధ్యక్షుడు పరిష్కరిస్తారని ఆయన అన్నారు. అందరు కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. పార్టీ మద్దతు మేరకే కొవ్వూరులో ఉద్యమం జరుగుతోందన్నారు. ఉద్యం గురించి, కేసుల వివరాలు గురించి పార్టీ అధ్యక్షుడు వద్ద పూర్తి సమాచారం ఉందని అన్నారు. జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, వేగి చిన్నా,గారపాటి వెంకటకృష్ణ, కరుటూరి సతీష్‌,  కోడూరి ప్రసాద్‌, శ్రీనివాస్‌, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-02-08T12:28:40+05:30 IST