సీపీఎస్‌ రద్దు హామీకి కట్టుబడి ఉండాలి

ABN , First Publish Date - 2020-03-04T11:20:13+05:30 IST

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ప్రయోజనార్దం సీపీఎస్‌ రద్దుకు సహకరిస్తామన్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌

సీపీఎస్‌ రద్దు హామీకి కట్టుబడి ఉండాలి

సీఎంను కోరిన యూటీఎఫ్‌ నేతలు 

ఏలూరులో భారీ బహిరంగ సభ 


ఏలూరు కలెక్టరేట్‌, మార్చి 3: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ప్రయోజనార్దం సీపీఎస్‌ రద్దుకు సహకరిస్తామన్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి హామీకి కట్టుబడి ఉండాలని యూటీఎఫ్‌ నేతలు కోరారు. ప్రతిపక్షంలో ఉండగా మాటతప్పను, మడమ తిప్పను అని  ఇప్పుడు మాటతప్పారని, ఇచ్చిన హామీ లన్నీ నెరవేర్చాలని యుటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ సాబ్జీ డిమాండ్‌ చేశారు.


రాష్ట్ర సంఘం పిలుపుమేరకు ఏలూరులో 3 వేల మంది ఉపాధ్యాయులు మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. మునిసిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం నుంచి ర్యాలీ బయలుదేరి పాతబస్టాండ్‌, కర్రలవంతెన, ఫ్లైఓవర్‌, ఫైర్‌స్టేషన్‌, జడ్పీ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకుని ధర్నా నిర్వహించారు. యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పి.జయకర్‌ అధ్యక్షతన భారీ బహిరంగ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు సాబ్జీ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా నిర్వహించిన పాదయాత్రలో హామీలు ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన నెలలోపే సీపీఎస్‌ రద్దు చేస్తా మని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 9 నెలలు గడి చినా కమిటీలతో కాలయాపన చేయడం సరి కాద న్నారు.


మార్చి 31 లోగా కమిటీలు రిపోర్టు ఇవ్వాల్సి ఉండగా ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని నిర్ణయించడం మరింత జాప్యం చేయడం కోసమే తప్ప ఉద్యోగ ఉపాధ్యాయులకు ఎటువంటి ప్రయోజ నం లేదన్నారు. వచ్చే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో సీపీఎస్‌ రద్దు బిల్లు పెట్టి ఆమోదించాలని డిమాండ్‌ చేశారు. 11వ పీఆర్‌సీ కమిటి రిపోర్టు గడువు ఇప్పటికే నాలుగు సార్లు గడువు పెంచారని వెంటనే రిపోర్టు రప్పించి 55 శాతం ఫిట్‌మెంట్‌తో 2018 జులై 1 నుంచి అమలు చేయడానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించా లన్నారు. బుధవారం జరగనున్న మంత్రి వర్గ సమావే శంలో సీపీఎస్‌ రద్దు, పీఆర్‌సీ అమలు పెండింగ్‌లో ఉన్న డీఏ విడుదల కేటాయింపులు జరపాలని లేనిపక్షంలో చలో అసెంబ్లీకి పిలుపునిస్తామన్నారు. టీచర్స్‌ ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ సీఎం జగన్‌ ఇచ్చిన హామీల అమలులో తాత్సారం చేయడం తగదన్నారు.


యుటీఎఫ్‌ పోరాటాలకు పీడీ ఎఫ్‌ మద్దతు నిస్తుందన్నారు. జెఏసీ చైర్మన్‌ ఆర్‌ఎస్‌ హరినాథ, సెక్రటరీ జనరల్‌ శ్రీనివాసరావు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్‌ ప్రసంగిం చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నాయ కులు బి.గోపిమూర్తి, ఎంవీ.శ్యాంబాబు, ఏకే. రామ భద్రం, రవికుమార్‌, జగన్మోహనరావు, నంబూరి రాం బాబు, అప్పారావు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


Updated Date - 2020-03-04T11:20:13+05:30 IST