కొడుకును చంపిన తండ్రి

ABN , First Publish Date - 2020-11-19T06:05:29+05:30 IST

నాటు సారా మత్తులో కన్న కొడుకును, అడ్డొచ్చిన భార్యను గొడ్డలితో నరికాడు. కుమారుడు మృతి చెందగా.. భార్య పరిస్థితి విషమంగా ఉంది.

కొడుకును చంపిన తండ్రి
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి

 అడ్డొచ్చిన భార్యను నరికేశాడు.. సారా మత్తులో ఘాతుకం

నల్లజర్ల, నవంబరు 18: నాటు సారా మత్తులో కన్న కొడుకును, అడ్డొచ్చిన భార్యను గొడ్డలితో నరికాడు. కుమారుడు మృతి చెందగా.. భార్య పరిస్థితి విషమంగా ఉంది. నల్లజర్ల మండలం జగన్నాథపురంలో మంగళ వారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలను తాడేపల్లిగూడెం రూరల్‌ సీఐ రవికుమార్‌ తెలిపారు. పసగడి రాంబాబు తన ఇద్దరు కుమారులతో వివాహాది శుభకా ర్యాలకు వంటలు చేస్తూ.. రెండు పోర్షన్ల తన ఇంటిలో ఉంటున్నాడు. పెద్ద కుమారుడికి వివాహం కావడంతో అతని కుటుంబం ఒక పోర్షన్‌లోను, తన భార్య కుమారి, చిన్న కుమారుడు అచ్చారావు(25)తో కలిసి మరో పోర్షన్‌లోను ఉంటున్నారు. కొద్ది రోజులుగా కుటుంబం లో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మద్యం అలవాటున్న రాంబాబు నాటు సారా తాగి మంగళవారం రాత్రి భార్య, చిన్న కుమారుడితో ఘర్షణకు దిగా డు. గొడ్డలితో అచ్చారావును, అడ్డు వచ్చిన భార్యను నరికేశాడు. ఇద్దరూ అరుస్తూ కుప్పకూలిపోయారు. ఇం తలో పెద్ద కుమారుడు, స్థానికులు అక్కడకు చేరుకుని రక్తపు మడుగులోవున్న వీరి ద్దరిని 108 అంబులెన్స్‌లో నల్లజర్ల ఆసుపత్రికి, అనంతరం ఏలూరు ప్రభుత్వ ఆసు పత్రికి తీసుకువెళ్లారు. మార్గమధ్యలో అచ్చారావు మృతి చెందగా చికిత్స పొందుతున్న కుమారి పరిస్థితి విషమంగా వున్నట్టు చెబుతున్నారు. నిందితుడు రాంబాబును అదుపులోకి తీసుకుని, కేసు దర్యాప్తు చేస్టున్నట్టు ఎస్‌ఐ చంద్రశేఖర్‌ తెలిపారు. Updated Date - 2020-11-19T06:05:29+05:30 IST