హత్యాయత్నం కేసులో కడప జిల్లా వాసి అరెస్టు

ABN , First Publish Date - 2020-11-20T05:04:39+05:30 IST

హత్యాయత్నం కేసులో ఒక యువకుడిని పోలీ సులు అరెస్టు చేశారు.

హత్యాయత్నం కేసులో కడప జిల్లా వాసి అరెస్టు
పోలీసుల అదుపులో శివ నరసింహారెడ్డి

ఉంగుటూరు,నవంబరు 19 : హత్యాయత్నం కేసులో ఒక యువకుడిని పోలీ సులు అరెస్టు చేశారు.వెల్లమిల్లి శివారు చిన వెల్లమిల్లికి చెందిన ఎలిబండి స్వామిని ప్రస్తుతం సింగపూర్‌లో ఉంటున్న గణపవరం గ్రామానికి చెందిన ముత్యాల కిశోర్‌ హత్య చేయించేందుకు ప్రయత్నించాడు. ఈ మేరకు కిశోర్‌ స్నేహితుడైన కడప జిల్లా పెండ్లిమర్రి మండలం సంగటిపల్లికి చెందిన చిత్తోలపల్లి శివ నరసింహారెడ్డితో ఒప్పందం కుదుర్చుకున్నాడు.దీనిలో భాగంగా ఈ నెల 3వ తేదీ రాత్రి స్వామిఇంట్లో నిద్రిస్తుండగా చాకుతో పొడవగా కేకలు వేయడంతో మోటారు సైకిల్‌, పర్సు వదిలి పారిపోయాడు. అనంతరం క్షతగాత్రుడిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలిం చారు.4వ తేదీన ప్రభుత్వాసుపత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగి పర్సులో దొరికిన ఆధారాల ప్రకారం పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మేరకు శివ నరసింహారెడ్డిని గురువారం నారాయణపురం మురుగుకోడు వద్ద అదుపులోకి తీసుకున్నట్టు ఎస్‌ఐ వీర్రాజు తెలిపారు. ప్రధాన నిందితుడు కిశోర్‌పై జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2020-11-20T05:04:39+05:30 IST