‘మున్సిపల్ కార్మికులకు బకాయిలు చెల్లించాలి’
ABN , First Publish Date - 2020-12-10T06:27:19+05:30 IST
మున్సిపల్ కార్మికులకు ఐదు నెలలు హెల్త్ అలవెన్సు బకాయిలు వెంటనే చెల్లించాలని, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పీవీ ప్రతాప్ డిమాండ్ చేశారు.

తణుకు, డిసెంబరు 9 : మున్సిపల్ కార్మికులకు ఐదు నెలలు హెల్త్ అలవెన్సు బకాయిలు వెంటనే చెల్లించాలని, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పీవీ ప్రతాప్ డిమాండ్ చేశారు. ఏపీ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తణుకు డివిజన్ భవన నిర్మాణ శంకుస్థాపనకు తణుకు వచ్చిన ఎమ్మెల్సీలు రాము సూర్యారావు, ఇళ్ల వెంకటేశ్వరరావులకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాను లెక్క చేయకుండా ప్రజల ఆరోగ్యాల కోసం మున్సిపల్ కార్మికులు అందిస్తున్న సేవలు ఎవరూ మరువరానివని అన్నారు. ఆగస్టు నుంచి డిసెంబరు వరకు హెల్త్ అలవెన్సు బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం కార్మికులను మానసికంగా వేధిస్తుందన్నారు. సమస్యలపై అధికారులు ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం చే యాలని కోరారు. ఎన్.ఆదినారాయణబాబు, వై.మందులయ్య, పండు పాల్గొన్నారు.