నోట్లో దుస్తులు కుక్కి.. చేతులు కట్టేసి..

ABN , First Publish Date - 2020-07-15T17:33:37+05:30 IST

నోటిలో దుస్తులు కుక్కి.. చేతులను కట్టేసి పాశవికంగా..

నోట్లో దుస్తులు కుక్కి.. చేతులు కట్టేసి..

ధర్మవరంలో వృద్ధురాలి హత్య


కొవ్వూరు(పశ్చిమ గోదావరి): ఒక వృద్ధురాలి నోటిలో దుస్తులు కుక్కి.. చేతులను కట్టేసి పాశవికంగా హత్య చేశారు. ధర్మవరం గ్రామానికి చెందిన కుందుల వసంత రాజ్యలక్ష్మి (70) ఒంటరిగా జీవిస్తోంది. ఆమె ఇంట్లోని ఒక వాటాలో వృద్ధురాలు నివాసం ఉంటుండగా.. మరో వాటాలో మృతురాలి బావ కుమారుడు రమేశ్‌బాబు ఉంటున్నాడు. ఆమె ప్రతీ రోజూ గీతాపారాయణం చేసి రాత్రి పది గంటలకు నిద్రించేదని.. సోమవారం రాత్రి అలాగే పడుకుందని రమేశ్‌బాబు తెలిపారు.


అదే గ్రామానికి చెందిన యశోద అనే మహిళ మంగళవారం ఉదయం ఇంటికి వచ్చి రాజ్యలక్ష్మిని పిలిచినా పలకలేదు.. తలుపులు తెరిచి ఉండడంతో లోపలకు వెళ్లి చూడగా మంచంపై విగత జీవిగా పడి ఉంది. విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. కొవ్వూరు డీఎస్పీ కె.రాజేశ్వరరెడ్డి, రూరల్‌ సీఐ సురేశ్‌, సిబ్బందితో గ్రామానికి చేరుకుని క్లూస్‌ టీమ్‌ను రప్పించి తనిఖీలు చేశారు. బంగారం కోసం వృద్ధురాలి చంపి ఉండవచ్చని మొదట భావించారు. బంగారం ఇంటిలో దొరకడంతో వృద్ధురాలిని దేని కోసం హత్య చేసి ఉంటారనే దానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 


Updated Date - 2020-07-15T17:33:37+05:30 IST