వానరం.. వరాహ విహారం
ABN , First Publish Date - 2020-11-14T04:57:03+05:30 IST
కోతి చేష్టలే కానీ.. దీనికీ కారణం ఉంది. ఆ వీధిలో విందు జరిగితే పడేసిన ఆకుల వద్ద వరాహం, వానరానికి వైరం నెలకొంది.
పాలకోడేరు, నవంబరు 13 : కోతి చేష్టలే కానీ.. దీనికీ కారణం ఉంది. ఆ వీధిలో విందు జరిగితే పడేసిన ఆకుల వద్ద వరాహం, వానరానికి వైరం నెలకొంది. ఓ కోతి ఆకుల వద్ద పదార్థాలు తినడా నికి వస్తే వరాహం అడ్డుపడింది. అసలే కోతి.. ఆపై కోపం వచ్చింది. విస్తరితో సహా వరాహం వీపునెక్కి విందారగించింది. అయినా దిగిందా. కాసేపు వీధంతా సవారీ చేసింది. వరాహం సైతం తప్పదన్నట్లు వానరంతో అలాగే తిరిగింది. కోతి కోపం తగ్గిందో లేదో కాని వరాహం తిక్క కుదిరింది గరగపర్రులో శుక్రవారం ఈ సరదా సంఘటన స్థానికులకు వినోదాన్ని ఇచ్చింది.