పూర్తైన ఇళ్లను లబ్దిదారులకు పంపిణీ చేయాలి.. ఎంఎల్‌సీ అంగర డిమాండ్

ABN , First Publish Date - 2020-11-06T21:20:34+05:30 IST

టిడ్కో లబ్దిదారుల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఎంఎల్సీ అంగర రామ్మోహన్ మండిపడ్డారు. జగన్ సర్కారు అన్ని రంగాల్లోనూ విఫలమయ్యిందని విమర్శించారు.

పూర్తైన ఇళ్లను లబ్దిదారులకు పంపిణీ చేయాలి.. ఎంఎల్‌సీ అంగర డిమాండ్

పాలకొల్లు: టిడ్కో లబ్దిదారుల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఎంఎల్సీ అంగర రామ్మోహన్ మండిపడ్డారు. జగన్ సర్కారు అన్ని రంగాల్లోనూ విఫలమయ్యిందని విమర్శించారు. అసమర్థుడైన సీఎం ఉంటే పరిపాలన ఎలా ఉంటుందో జగన్ చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి అన్ని వ్యవస్థలపైనా నియంత్రణ కోల్పోయారన్నారు. పాలకొల్లులో ‘నా ఇల్లు - నా సొంతం’ పేరుతో ప్రదర్శన నిర్వహించారు. పూర్తైన ఇళ్లను లబ్దిదారులకు వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ.. పట్టణంలోని పలు వార్డులలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగర రామ్మోహన్, ఎంఎల్ఏ నిమ్మల రామానాయుడు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-06T21:20:34+05:30 IST