కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

ABN , First Publish Date - 2020-12-02T04:44:01+05:30 IST

భారీ వర్షాలు, తుఫాన్‌తో లక్షలాది ఎక రాల్లో వరి పంటకు నష్టం వాటిల్లిందని, ప్రతీ రైతుతీవ్రంగా నష్టపోయాడని, ఈ పరిస్థితుల్లో కౌలు రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని ఎమ్మెల్సీ అంగర రామమోహన్‌ అన్నారు.

కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

శాసన మండలిలో ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌


పాలకొల్లు అర్బన్‌, డిసెంబరు 1: భారీ వర్షాలు, తుఫాన్‌తో లక్షలాది ఎక రాల్లో వరి పంటకు నష్టం వాటిల్లిందని, ప్రతీ రైతుతీవ్రంగా నష్టపోయాడని, ఈ పరిస్థితుల్లో కౌలు రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని ఎమ్మెల్సీ అంగర రామమోహన్‌ అన్నారు. శాసనమండలి సమావేశాల్లో మంగళవారం ఆయన ప్రసంగించారు. ఆయన లేవనెత్తిన అంశాలను ఫోన్‌ ద్వారా తెలియ జేశారు. వరి సాగుచేసే కౌలు రౌతులు భవిష్యత్‌లో సాగును విరమించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తున్నామని చెప్పి నేటికీ ఒక పైసాకూడా రైతులకు ప్రభుత్వం చెల్లించలేదన్నారు. మంత్రులు మాత్రం వారి సొంత నియోజక వర్గాలకే పరిమితం అవుతున్నారని, రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని అంగర రామ్మోహన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కౌలు రైతు పరిస్థితి మరింత దయనీయంగా మారిందన్నారు. 14, 15 బస్తాలు లీజుకు తీసుకున్నవారు లీజు పక్కన పెడితే రూ.20వేల వరకు పెట్టుబడిని నష్టపోయారని, వరి పంట కనీసం పశువుల మేతగా కూడా పనికిరాకుండా పోయిందని ఆయన సభ దృష్టికి తీసుకువెళ్లారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయం లో వరికి మద్దతు ధర కన్నా రూ.200 అధికంగా చెల్లించడం జరిగిందన్నారు. ప్రస్తుతం కూడా రైతులకు మద్దతు ధరకన్నా ఎక్కువగా ప్రభుత్వం చెల్లించాలని అంగర డిమాండ్‌ చేశారు. రైతులను ఆదుకోవాలని సభాపతి ద్వారా ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ కోరారు.

Updated Date - 2020-12-02T04:44:01+05:30 IST