రైతులను ఆదుకోవాలి : ఎమ్మెల్యే రామరాజు

ABN , First Publish Date - 2020-10-24T11:48:36+05:30 IST

చేలు నీట మునిగి నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఎమ్మెల్యే మంతెన రామరాజు కోరారు. సీసలిలో నీట మునిగిన చేలను శుక్రవారం..

రైతులను ఆదుకోవాలి : ఎమ్మెల్యే రామరాజు

కాళ్ళ, అక్టోబరు 23 : చేలు నీట మునిగి నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఎమ్మెల్యే మంతెన రామరాజు కోరారు. సీసలిలో నీట మునిగిన చేలను శుక్రవారం ఆయన పరిశీలించారు. అధికారులు పంట నష్టాన్ని అంచనా వేయడంలో అందరికి న్యాయం జరిగేటట్లు చూడాలన్నారు. సీసలిలో డ్రెయినేజీ దుస్థితి గ్రామస్థులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తోట ఫణిబాబు, కట్రెడ్డి శ్రీనివాసరావు, వీరవల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.


భీమవరం రూరల్‌ : కొమరాడ, అనాకోడేరు గ్రామాల్లో నీట మునిగిన ప్రాంతాలు, వరి చేలను ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ శుక్రవారం పరిశీలించారు. రైతులు, ముంపు ప్రాంత ప్రజలు అధైర్యపడవద్దన్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందన్నారు. తహసీల్దార్‌ రమణరావు, ఏఎంసీ చైర్మన్‌ తిరుమాని ఏడుకొండలు, వ్యవసాయశాఖ సలహా మండలి చైర్మన్‌ చినిమిల్లి నాగన్న, కొట్టి కుటుంబరావు, తదితరులు పాల్గొన్నారు.


సిద్ధాపురం (ఆకివీడు రూరల్‌): వరద బాధితులను ప్రభుత్వం ఆదు కుంటుందని రూరల్‌ బ్యాంకు చైర్మన్‌ కేశిరెడ్డి మురళి అన్నారు. మండలంలోని గుమ్ములూరు, కోళ్ళపర్రు, కళింగపాలెం, చినిమిల్లిపాడు, సిద్దాపురం ముంపు ప్రాంతాలలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఎం.జ్యోతి, తంగి పుష్కరరావు, జిఎస్‌ఆర్‌ నాయుడు, ఇందుకూరి నారాయణరాజు, బుజ్జిరాజు, అంజిరాజు, తోట శివాజీ, జెఎస్‌ఆర్‌ తదితరులున్నారు. 


ఆకివీడు: మాదివాడ ముంపులో ఉన్న 200 కుటుంబాలకు రాధా రంగ మిత్ర మండలి ఆధ్వర్యంలో శుక్రవారం పాలు, గుడ్లు అందజేశారు. ముంపు నీటిలో రాకపోకలకు ట్రాక్టర్‌ ఏర్పాటుచేశారు. నిమ్మల నాగు, పుప్పాల పండు, చిన్నా, దాసరి వెంకట సత్యనారాయణ, మోటుపల్లి శ్రీను పాల్గొన్నారు.ముంపు ప్రాంతాలలో సమస్యలను సీపీఎం నాయకులు తెలుసుకు న్నారు. తవిటినాయుడు, గేదెల అప్పారావు, బి.రాము, రవితేజ, భాషా పాల్గొన్నారు.

Updated Date - 2020-10-24T11:48:36+05:30 IST