వైఎస్‌ జయంతినాడు స్థలాలిస్తాం : పుప్పాల

ABN , First Publish Date - 2020-05-10T09:01:18+05:30 IST

దివంగత నేత వైఎస్‌ఆర్‌ జయంతి నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు అందజేస్తామని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు తెలిపారు.

వైఎస్‌ జయంతినాడు స్థలాలిస్తాం : పుప్పాల

భీమడోలు/గణపరం, మే 9 :దివంగత నేత వైఎస్‌ఆర్‌ జయంతి నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు అందజేస్తామని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు తెలిపారు.గుండుగొలనులో ఇళ్ల స్థలాలకు సేకరించిన 25 ఎకరాల భూమిలో శనివారం పూజచేసి ఇళ్ల నిర్మాణాలకు చదునుచేసే పనులను ప్రారంభించారు. ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకూ 60 ఎకరాల భూమి కొనుగోలు చేశామన్నారు. గణపవరంలో నాబార్డ్‌ నిధులు రూ.78 లక్షలతో నిర్మిస్తున్న రక్షిత మంచినీటి సరఫరా పథకం ఓవర్‌ హెడ్‌ ట్యాంకు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సెప్టెంబరు నాటికి పనులు పూర్తి చేయాలని ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు.

Updated Date - 2020-05-10T09:01:18+05:30 IST