పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నిరసన
ABN , First Publish Date - 2020-12-29T19:46:25+05:30 IST
ఇన్‌పుట్ సబ్బీసీడిని తగ్గించంపై పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ నిరసనకు దిగారు.
ఏలూరు: ఇన్‌పుట్ సబ్బీసీడిని తగ్గించంపై పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ నిరసనకు దిగారు. ఇన్ పుట్ సబ్సిడీ జీవోకు నల్లరంగు పూసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ... చంద్రబాబు హయాంలో 20 వేల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని జగన్ హయాంలో 15వేలకు తగ్గించడం రివర్స్ పాలన కాదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్వాకంతో గత సంవత్సరం ఇన్సూరెన్సు నీటిలో, నేటి సంవత్సరం ఇన్సూరెన్స్ ఆకాశంలో ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మోటర్లకి మీటర్లు బిగించి రైతులను దొంగల్లా చూస్తున్నారని ఎమ్మెల్యే రామానాయుడు దుయ్యబట్టారు.