వైటీ రాజా మృతి టీడీపీకి తీరని లోటు: ఎమ్మెల్యే నిమ్మల

ABN , First Publish Date - 2020-11-15T16:22:15+05:30 IST

తణుకు మాజీ ఎంఎల్‌ఏ వైటీ రాజా అకాల మృతి పట్ల పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

వైటీ రాజా మృతి టీడీపీకి తీరని లోటు: ఎమ్మెల్యే నిమ్మల

ఏలూరు: తణుకు మాజీ ఎంఎల్‌ఏ వైటీ రాజా అకాల మృతి పట్ల పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సౌమ్యులు, పేదలపాలిటి పెన్నిధిగా ఉన్న  రాజా మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. 





పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే వై.టీ. రాజా అనారోగ్యంతో కన్నుమూశారు. ఇటీవలే ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. రాజా మృతితో కుటుంబ సభ్యులు, అనుచరులు కన్నీరుమున్నీరవుతున్నారు. విషయం తెలుసుకున్న పలువురు కార్యకర్తలు, జిల్లాకు చెందిన నేతలు హైదరాబాద్‌కు పయనమయ్యారు. రాజా మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్సీ నారా లోకేష్‌తో పాటు పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Updated Date - 2020-11-15T16:22:15+05:30 IST