ఆకివీడులో బెంగాల్‌ యువకుడి అదృశ్యం

ABN , First Publish Date - 2020-11-07T04:31:58+05:30 IST

సబ్‌ స్టేషన్‌ సైట్‌లో పనిచేస్తున్న యువకుడు కనిపించడంలేని సైట్‌ ఇన్‌ఛార్జి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆకివీడులో బెంగాల్‌ యువకుడి అదృశ్యం

ఆకివీడు, నవంబరు 6: సబ్‌ స్టేషన్‌ సైట్‌లో పనిచేస్తున్న యువకుడు కనిపించడంలేని సైట్‌ ఇన్‌ఛార్జి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెస్ట్‌ బెంగాల్‌ నుంచి వచ్చిన సుజిత్‌ రిషి తాళ్ళకోడులో ఉంటూ స్థానిక సబ్‌ స్టేషన్‌లో సైట్‌ ఇన్‌చార్జి గుత్తుల రమేష్‌ హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. గత నెల 22న వెళ్ళిన రిషి కనబడకపోవడంతో పలుచోట్ల వెతికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ వీఎస్‌ వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-11-07T04:31:58+05:30 IST