గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం

ABN , First Publish Date - 2020-12-06T04:59:52+05:30 IST

గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు.

గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం

మంత్రి రంగనాథరాజు

ఆచంట, డిసెంబరు 5: గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. ఆచంటలో హెల్త్‌ క్లినిక్‌, ఎ.వే మవరంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణాలకు శనివారం మంత్రి రంగనాథరాజు, గుబ్బల తమ్మయ్య శంకుస్థాపన చేశారు. సచివాలయ భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులను కోరారు.వైట్ల కిశోర్‌, గెద్దాడ మంగారావు, సుంకర సీతారాం, విశ్వనాథం సత్యనారాయణ, అందే నాగబసవన్న, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T04:59:52+05:30 IST