వ్యవసాయం లాభసాటి చేయడమే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2020-11-08T04:40:43+05:30 IST

వ్యవసాయం లాభసాటి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు.

వ్యవసాయం లాభసాటి చేయడమే ప్రభుత్వ లక్ష్యం

పెనుగొండ, నవంబరు7: వ్యవసాయం  లాభసాటి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. పెనుగొండ ఏఎంసీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. అధిక వర్షాలతో డెల్టాలో రైతులు నష్టపోయారని, ఆదుకకునేందుకు సీఎం జగన్‌ చర్యలు తీసుకుంటున్నారన్నారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 876 రైతు భరోసా కేంద్రాలు, 626 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 14 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నామన్నారు. జేడీఏ గౌసియా బేగం మాట్లాడుతూ వర్షాల కారణంగా లక్షా 80 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి తగ్గనుందన్నారు. రైస్‌మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు చామంతపూడి శ్రీరామరాజు, కార్యదర్శి ఆళ్ల సతీష్‌, డీసీసీబీ ఉపాధ్యక్షుడు ఆతుకూరి దొరయ్య, కూనపరెడ్డి లక్ష్మయ్యనాయుడు, ఏడీఏ ఎంవీ.రమేష్‌, ఎంపీడీవో పీఎస్‌వీ.రెడ్డి, తహసీల్దార్‌ రవికుమార్‌, దంపనబోయిన బాబూరావు, తదితరులు పాల్గొనారు.

Updated Date - 2020-11-08T04:40:43+05:30 IST