వలస కార్మికుల తరలింపు

ABN , First Publish Date - 2020-06-02T09:27:55+05:30 IST

బిహార్‌ రాష్ట్రానికి చెందిన ఆరుగురు, ఒడిశా రాష్ట్రానికి 27 మంది వలస కార్మికులను ఏలూరు నుంచి ప్రత్యేక

వలస కార్మికుల తరలింపు

ఏలూరు క్రైం, జూన్‌ 1 : బిహార్‌ రాష్ట్రానికి చెందిన ఆరుగురు, ఒడిశా రాష్ట్రానికి 27 మంది వలస కార్మికులను ఏలూరు నుంచి ప్రత్యేక బస్సుల్లో  సోమవారం పంపించారు. ఏలూరు సమీపంలోని మెయిన్‌ బైపాస్‌, వట్లూరి బాలయోగి బాలిక వసతి గృహంలో ఆశ్రయం పొందుతున్న మొత్తం 33 మంది వలస కార్మికులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు.


జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.శైలజ, రెడ్‌క్రాస్‌ సభ్యుల సహకారంతో వైద్య పరీక్షలు నిర్వహించి ఆహారం, రొట్టెలు, బిస్కెట్లు, మంచినీరు అందజేశారు. ఏలూరు బార్‌ అసోసియేషన్‌ ఇచ్చిన నగదును ఒకొక్కరికి రూ.200 అందజేశారు. ప్రజా రవాణా శాఖ సహకారంతో ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసి ఆయా రాష్ట్రాలకు పంపించారు. న్యాయవాదులు కూన కృష్ణారావు, కట్టా సత్యనారాయణ, పారాలీగల్‌ వలంటీర్‌ రంగారావు, రెడ్‌క్రాస్‌ సెక్రటరీ తన్నీరు బుజ్జి, వీఆర్వో శివనాగరాజు పాల్గొన్నారు.


పోలవరం పనులకు బిహార్‌ కార్మికులు

పోలవరం: పోలవరం ప్రాజెక్టు పనులకు బిహార్‌ కార్మికులను తిరిగి తీసుకువస్తున్నారు. కరోనా వైరస్‌ భయంతో గత నెలలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు తరలిపోవడంతో ప్రాజెక్టు పనులు నిలిచిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికారుల ఒత్తిడి మేరకు కాంట్రాక్టర్లు ఆరు బస్సుల లో 190 మంది బిహార్‌ కార్మికులను రప్పించినట్టు తెలిసింది.

Updated Date - 2020-06-02T09:27:55+05:30 IST