మావుళ్లమ్మ మాలధారణ ప్రారంభం

ABN , First Publish Date - 2020-11-01T05:05:43+05:30 IST

మావుళ్లమ్మ ఆలయంలో శనివారం భక్తులు అమ్మవారి మాలధారణ చేపట్టారు. ఆలయ ప్రధానార్చకుడు కొడమంచిలి సుబ్రహ్మణ్యం కలశ స్థాపన చేసిన అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

మావుళ్లమ్మ మాలధారణ ప్రారంభం
మావుళ్లమ్మ మాలధారణలో భక్తులు

భీమవరం టౌన్‌, అక్టోబరు 31: మావుళ్లమ్మ ఆలయంలో  శనివారం భక్తులు అమ్మవారి మాలధారణ చేపట్టారు. ఆలయ ప్రధానార్చకుడు కొడమంచిలి సుబ్రహ్మణ్యం కలశ స్థాపన చేసిన అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాలధారణ చేసుకుని భక్తులకు మాలధారణ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా విఘ్నేశ్వర పూజ చేసిన అనంతరం మాలలకు పూజలు చేసి తదుపరి వారికి మాలధారణ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో దాసరి శ్రీరామ వర ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. కొవిడ్‌ నిబందనలు నడుమ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Read more