మట్టి అక్రమ తవ్వకాలు నిలిపివేత

ABN , First Publish Date - 2020-12-28T05:48:56+05:30 IST

లే–అవుట్లలో మెరక పనులు చేసేందుకు అక్రమంగా చేపట్టిన మట్టి తవ్వకాలను ఆదివారం రెవెన్యూ అధికారులు అడ్డుకుని నిలిపివేశారు.

మట్టి అక్రమ తవ్వకాలు నిలిపివేత

ఏలూరు రూరల్‌, డిసెంబరు 27 : ఏలూరు రూరల్‌ మండలం మాదేపల్లి శివారు లింగారావుగూడెం చెరువు సమీపంలో సుమారు 15 ఎకరాల్లో పేదలకు ఇచ్చేం దుకు లే–అవుట్లు సిద్ధం చేస్తున్నారు. ఆ లే–అవుట్‌లకు వెళ్లేందుకు రహదారి లేకపోవడంతో పక్కనే ఉన్న కొందరి దళితులకు చెందిన భూముల్లో మట్టిని తవ్వి ప్లాట్లలో రోడ్డు వేసేందుకు ఎక్స్‌కవేటర్‌, ట్రాక్టర్లతో మట్టి తరలిస్తున్నారు. దీంతో పొలానికి చెందిన వ్యక్తులు రెవెన్యూ అధికారులకు తెలిపారు. దీంతో అధికారులు అక్కడకు చేరుకుని మట్టి తవ్వేందుకు ఎటువంటి అనుమతులు లేకపోవడంతో వాటిని అడ్డుకుని పనులను నిలిపివేశారు. అక్రమంగా మట్టి తవ్వకాలపై అటు రెవెన్యూ, ఇటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2020-12-28T05:48:56+05:30 IST