గణిత ప్రతిభ పరీక్షలో లావణ్య ఫస్ట్‌

ABN , First Publish Date - 2020-11-20T05:13:49+05:30 IST

:ప్రభుత్వ పాఠ శాలల్లో పదో తరగతి (2019–20) చదువు తున్న విద్యార్థులకు నిర్వహించిన గణితం ప్రతిభా పాటవ పరీ క్షలో ప్రథమ స్థానం లో నిలిచింది.

గణిత ప్రతిభ పరీక్షలో లావణ్య ఫస్ట్‌

ఏలూరు ఎడ్యు కేషన్‌, న వంబరు 19 :ప్రభుత్వ పాఠ శాలల్లో పదో తరగతి (2019–20) చదువు తున్న విద్యార్థులకు నిర్వహించిన గణితం ప్రతిభా పాటవ పరీ క్షలో ప్రథమ స్థానం లో నిలిచింది. ఈ సందర్భంగా సత్రంపాడు జడ్పీ హైస్కూలు విద్యార్థిని రెడ్డి లావణ్యకు రెండేళ్ల ఇంటర్‌ చదువుకయ్యే పూర్తి ఫీజు రూ.1.50 లక్షలను నగదు బహుమతిగా చాటపర్రు గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు భరత్‌ గురువారం అందజేశారు. లావణ్యతో పాటు బహుమతులు గెలుచుకున్న 8, 9, 10 తరగతులు చదువుతున్న పది మంది విద్యార్థులకు ఒకొక్కరికి మూడు వేలు రూపాయలు చొప్పున నగదు అందజేశారు. స్కూలు ఉపాధ్యాయులు కె. రవిబాబు, ఆర్‌.జయ రామ్‌, టి.హిమబిందులకు బెస్ట్‌ టీచర్స్‌ పురస్కారాలను అందజేశారు. హెచ్‌ఎం వడ్లపట్ల మురళీకృష్ణ మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థిని ప్రథమ స్థానంలో నిలవడం సంతోషమన్నారు. భరత్‌ తండ్రి జాస్తి పట్టాభిరామయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-20T05:13:49+05:30 IST