ఆన్‌లైన్‌లో వివాహ రిజిస్ర్టేషన్‌

ABN , First Publish Date - 2020-06-24T10:12:00+05:30 IST

వివాహ రిజిస్ట్రేషన్‌ ఆవశ్యకత రోజురోజుకూ పెరుగుతూ ఉంది. భార్యాభర్తల వివాదాల పరిష్కారంలోనూ, విదేశీ పర్యటనల

ఆన్‌లైన్‌లో వివాహ రిజిస్ర్టేషన్‌

సిద్ధమైన సాఫ్ట్‌వేర్‌

సచివాలయాలు, మీసేవ ద్వారా దరఖాస్తు

ఇకపై ఆన్‌లైన్‌లోనే వివాహ ధ్రువీకరణ పత్రం


ఏలూరు, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): వివాహ రిజిస్ట్రేషన్‌ ఆవశ్యకత రోజురోజుకూ పెరుగుతూ ఉంది. భార్యాభర్తల వివాదాల పరిష్కారంలోనూ, విదేశీ పర్యటనల సందర్భంలోనూ రిజిస్ట్రేషన్‌ అవసరమవుతోంది. దీంతో ఈ మధ్యకాలంలో రిజిస్ట్రేషన్లు బాగా పెరిగాయి. 2019లో జిల్లా వ్యాప్తంగా దాదాపు 3000 వివాహాలు రిజిస్టర్‌ అయ్యాయి. ఈ ఏడాది ఇప్పటికే వెయ్యికి పైగా రిజిస్టర్‌ అయ్యాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రిజిస్ట్రేషన్‌శాఖ వివాహ నమోదుకు ఆన్‌లైన్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అందుకోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొం దించింది. దీంతో వివాహాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ వేగవంతం కానుంది.


గతంలో వివాహాన్ని రిజిస్టర్‌ చేసు కోవాలనుకునే వారు విధిగా సంబంధిత సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. ఆ తరువాత విచారణ జరిపి, వివాహాన్ని రిజిస్టర్‌ చేసి ధ్రువీకరణపత్రం ఇచ్చేవారు. ఇప్పుడు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకుని పొదేందుకు అవకాశం ఉంది. ధ్రువీకరణపత్రం అసలుదా...కాదా అన్నది తెలుసు కోవాలన్నా గతంలో చాలా తతంగం ఉండేంది. సర్టిఫికేట్‌ జారీచేసిన సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని సంప్రదించి ధ్రువపరుచుకోవాల్సి వచ్చేది. ఈ కొత్త విధానం వల్ల ఆ సమస్య లేదు. ఆన్‌లైన్‌లోనే చెక్‌ చేసుకుంటే సరిపోతుంది.


మీసేవ, సచివాలయాల్లో దరఖాస్తులు

వివాహాల రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకునేవారు ఇకపై వారికి సమీపంలో ఉన్న గ్రామ, వార్డు సచి వాలయ కేంద్రానికి వెళ్లి అక్కడే ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసు కోవచ్చు. లేదంటే సమీపంలోని మీసేవ కేంద్రాలలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేవారు వివాహ పత్రిక లేదా శుభలేఖ, వివాహానికి సంబంఽధించిన ఫొటోలు, సాక్షుల వివరాలు, వధూవరుల వయసు, కుల ధ్రువీకరణ పత్రాలు అప్‌ లోడ్‌ చేయాల్సి ఉంటుంది. వీటన్నింటిని సంబంధిత సబ్‌ రిజిస్ట్రార్‌ పరిశీలించి వివాహపత్రం జారీ చేస్తారు. దీనిని సచివా లయాల్లోనే పొందవచ్చు. దేవాలయాల్లో ఇచ్చే వివాహపత్రం కేవలం ఆధారంగా మాత్రమే పనిచేస్తుంది. అది రిజిస్ట్రేషన్‌ కిందకి రాదు. క్రిస్టియన్‌ వివాహాల విషయంలో రిజిస్టర్డ్‌ పాస్టర్లు చేసిన వివాహాలను మాత్రమే రిజిస్టర్‌ చేసేందుకు వీలుంది. వివిధ సంఘాలు, యూనియన్లు, నిర్వ హించే సంప్రదాయేతర వివాహాలు రిజిస్ట్రేషన్‌ చేసేందుకు వీలుండదని అధికారులు చెబుతున్నారు. రిజిస్టర్‌ పెళ్ళిళ్ల విషయంలో ఎలాంటి మార్పులు లేవు. వాటిని గతంలో మాదిరే నిర్వహిస్తారు. 


రిజిస్ట్రేషన్‌ చాలా అవసరం : లంకా వెంకటేశ్వర్లు, ఏలూరు జిల్లా రిజిస్ట్రార్‌

వివాహ రిజిస్ట్రేషన్‌ అనేది నేడు అత్యంత ఆవ శ్యకం. దీనివల్ల వివాహిత మహిళలకు రక్షణ ఉం టుంది. ఇటీవల వివాహాల రిజిస్ట్రేషన్ల సంఖ్య గణ నీయంగా పెరిగింది. పదుల సంఖ్యలో జరిగే రిజి స్ట్రేషన్లు, ఇప్పుడు వందల సంఖ్యకు పెరిగాయి. దీనిని మరింత విస్తృత పరచడం కోసం ఆన్‌ లైన్‌ సేవలు అందుబాటులోకి తెచ్చాం.

Updated Date - 2020-06-24T10:12:00+05:30 IST